ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సుద్దాల అశోక్ తేజ 'సార్' చిత్రం కోసం 'బంజారా' గీతాన్ని రాశారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ స్వరరచన చేశారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ కు లభించిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీజన్ 2కు ఆహా సంస్థ శ్రీకారం చుట్టింది. త్వరలోనే వివిధ నగరాలు, పట్టణాలలో ఆడిషన్స్ మొదలు కానున్నాయి!
ప్రతి సంవత్సరంలానే ఈ యేడాది కూడా పలువురు కొత్త నాయికలు తెలుగులో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే పరభాషల్లో తమ సత్తా చాటుకున్నవారు ఇందులో ఉన్నారు.
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన 'బెదురులంక 2012' చిత్రానికి ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా యు.ఎస్.ఎ. హక్కుల్ని రూ. 80 లక్షలకు ది విలేజ్ గ్రూపీ సంస్థ సొంతం చేసుకుంది.
తన భార్య హరిత ప్రెగ్నెంట్ అనే విషయం కొన్ని నెలల క్రితం తెలిపిన ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ, తాజాగా తనకు సంక్రాంతి రోజున కొడుకు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు.
'ది కశ్మీర్ ఫైల్స్' ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది వాక్సిన్ వార్'లో 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన తాజా షెడ్యూల్ లో ఆమె పాల్గొంటున్నారు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న శివరాజ్ కుమార్ 'ఘోస్ట్' మూవీ ఫిబ్రవరి నుండి మూడో షెడ్యూల్ మొదలు పెట్టబోతోంది. ఈ భారీ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.
ఇప్పటికే తమిళంలో పలు చిత్రాలలో నటించిన ప్రియ భవానీ శంకర్ 'కళ్యాణం కమనీయం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శనివారం జనం ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని సంతోష్ శోభన్ హీరోగా యూవీ కనెక్ట్స్ సంస్థ నిర్మించింది.
కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల చిత్ర నిర్మాణంలోకీ అడుగుపెట్టింది. తన తండ్రితోనూ సినిమా నిర్మించాలనే ఆలోచన ఉందని, అందుకోసం కథాన్వేషణలో పడ్డానని చెబుతోంది.