Allu Sirish: మోహన్ లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘1971: బియాండ్ బోర్డర్స్’ మూవీతో అల్లు శిరీష్ మల్లూవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ఐదేళ్ళ క్రితం వచ్చిన ఆ సినిమాను, అందులోని తన పాత్రను ఇవాళ అల్లు శిరీష్ గుర్తు చేసుకున్నాడు. జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరాక్రమ దివస్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. నేతాజీ 126వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున అండమాన్ అండ్ నికోబార్ లోని 21 ద్వీపాలకు ప్రధాని నరేంద్ర మోదీ పరమవీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టారు. అందులో ఒక దాని పేరు ఖేతర్పాల్ ఐలాండ్. 1971లో జరిగిన ఇండో -పాక్ వార్ లో సెకండ్ లెఫ్టెనెంట్ అరుణ్ ఖేతర్పాల్ పేరు మీద దీనికి ఈ పేరు పెట్టారు.
విశేషం ఏమంటే… మరణానంతరం పరమ వీర చక్ర అవార్డును పొందిన అరుణ్ ఖేతర్పాల్ పాత్రను ‘1971: బియాండ్ బోర్డర్స్’ మూవీలో అల్లు శిరీష్ పోషించాడు. ఆ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ”అండమాన్ అండ్ నికోబార్ లోని ఓ ద్వీపానికి 1971 యుద్థంలో ప్రాణం త్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ పేరు పెట్టినట్టు తెలిసి ఆనందించాను. నేను అతని పాత్రను పోషించిన ‘1971:బియాండ్ బోర్డర్స్’ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న రోజులు గుర్తొచ్చాయి” అని అన్నారు. మొత్తం మీద అల్లు శిరీష్ కు సంబంధించినంత వరకూ ఇదో తీపి, మరువలేని జ్ఞాపకం!!
Overwhelmed to know that an island in Andaman & Nicobar is named after Second lieutenant Arun Khetarpal who sacrificed his life in the 1971 war.
I am reliving the memories of making the film 1971:Beyond Borders in which I played his role. @narendramodi #IndiaHonoursParamveers
— Allu Sirish (@AlluSirish) January 23, 2023