‘Rebels of Thupakulagudem’: వారధి క్రియేషన్స్ పతాకంపై జైదీప్ విష్ణు తెరకెక్కించిన సినిమా ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’. దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య ‘రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ టీజర్‌ను డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది. ఈ టీజర్‌లో డైలాగ్స్, విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్.. ఇలా అన్నీ కూడా జనాలను ఆకట్టుకున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
Read Also: Thalapathy Vijay: విడాకులకు సిద్ధమైన విజయ్.. కారణం కీర్తి సురేశ్?
తాజాగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రధానమైన కారెక్టర్లను చూపించారు. దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాకు ఎడిటర్‌గానూ పని చేయగా, కథను అందించిన సంతోష్ మురారికర్ కో డైరెక్టర్‌గా వర్క్ చేశారు.
Read Also: Pawan Kalyan: బీజేపీతోనే ఉన్నా.. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా