పాన్ ఇండియా మూవీస్ గా శివరాత్రికి విడుదల కావాల్సిన 'శాకుంతలం, ధమ్కీ' వాయిదా పడుతున్న నేపథ్యంలో రెండు చిన్న సినిమాలు ఆ స్థానంలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సంతోష్ శోభన్ నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు', యశ్వంత్ నటించిన 'ఊ అంటావా మావ... ఊ ఊ అంటావా మావ' ఈ నెల 18న రాబోతున్నాయి.
ఎన్టీయార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవితో తెలుగు చిత్రాలు నిర్మించిన ఆర్.వి. గురుపాదం గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఆయన ఇరవైకు పైగా సినిమాలు నిర్మించారు.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన 'బుట్టబొమ్మ' చిత్రం శనివారం జనం ముందుకు వచ్చింది. ఈ సినిమాకు చక్కని స్పందన లభిస్తోందని, ఇందులోని సందేశాన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చిత్ర బృందం తెలిపింది.
దుల్కార్ సల్మాన్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'కింగ్ ఆఫ్ కొత్త' ఓనమ్ కానుకగా జనం ముందుకు రాబోతోంది. చిత్రసీమలో 11న సంవత్సరాలు పూర్తి చేసుకున్న దుల్కర్ హీరోగా అభిలాష్ జోషి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
'బుట్టబొమ్మ'తో తెలుగువారి ముందుకు వస్తున్న మరో యువ నటుడు సూర్య వశిష్ఠ. ప్రముఖ కో-డైరెక్టర్ స్వర్గీయ సత్యం తనయుడైన సూర్య ఈ చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందంటున్నాడు.
'కేరింత' ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న చిత్రం 'తెలుసా... మనసా'. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రంతో వైభవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు విడుదల చేశారు.
ఈ యేడాది ప్రారంభంలోనే 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఫిబ్రవరి 10న వస్తున్న 'అమిగోస్' కూడా హిట్ అయితే... ఈ సంస్థకు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ లభించినట్టే!!
సీనియర్ నటుడు, దర్శక నిర్మాత, రాజకీయ నేత విజయకాంత్ వివాహ వార్షికోత్సం సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఆయన అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. విజయకాంత్ ను పోల్చుకోలేకుండా ఉన్నామంటూ వారు వాపోతున్నారు.