Amigos: 30 రోజుల్లో మైత్రీ మూవీ మేకర్స్ హ్యాట్రిక్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyan Ram: మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రారంభించినప్పుడు వరుసగా ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ చిత్రాలతో హ్యాట్రిక్ ను సాధించింది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. తిరిగి ‘ఉప్పెన’, ‘పుష్ప’, ‘సర్కారు వారి పాట’తో మరోసారి హ్యాట్రిక్ ను ఈ సంస్థ అందుకుంది. మొదటి హ్యట్రిక్ తర్వాత ఎలాగైతే కొన్ని పరాజయాలను అందుకుందో, సెకండ్ హ్యాట్రిక్ తర్వాత కూడా మూడు పరాజయాలను చవిచూసింది. అయితే ఈ యేడాది ప్రారంభంలోనే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ జైత్ర యాత్ర మొదలెట్టింది. జనవరి 11న వచ్చిన బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’, 12న విడుదలైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ను అందుకుంది. ఆ ఊపుతోనే ఇప్పుడు 30 రోజులు గడవకముందే ముచ్చటగా మూడో చిత్రం ‘అమిగోస్’ను ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీలో మూడు భిన్నమైన పాత్రలతో జనాలను మెప్పించబోతున్నాడు. రెండు దశాబ్దాల క్రితమే షార్ట్ ఫిల్మ్ మేకర్ గా అవార్డులను అందుకుని, ఆపైన ‘వలయం’ అనే ఫీచర్ ఫిల్మ్ ను తెరకెక్కించిన రాజేంద్ర రెడ్డి ‘అమిగోస్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రం ఏమంటే ‘అమిగోస్’ అనేది ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల సొంత నిర్మాణ సంస్థ పేరు. టైటిల్ అనౌన్స్ మెంట్ నుండి జనాలలో ఆసక్తిని కలిగిస్తున్న ‘అమిగోస్’ కోసం నందమూరి బాలకృష్ణ ‘ధర్మక్షేత్రం’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ…’ అనే పాటను రీమిక్స్ చేశారు. తాజాగా విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలానే కళ్యాణ్ రామ్ గత చిత్రం ‘బింబిసార’ చక్కని విజయాన్ని అందుకోవడం, మైత్రీ మూవీ మేకర్స్ తిరిగి సక్సెస్ ట్రాక్ మీదకు రావడం ‘అమిగోస్’ కు కలిసొచ్చే అంశాలు. ఈ సినిమాలో ఏమాత్రం కొత్తదనం ఉన్నా తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఖాయం. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, ప్రచార చిత్రాలను చూస్తుంటే ఆ కళ ‘అమిగోస్’లో స్పష్టంగా కనిపిస్తోంది. సో… నెల రోజుల వ్యవథిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ సాధించే ఆస్కారం ఉంది. అదే జరిగే… మైత్రీ మూవీ మేకర్స్ తన జర్నీలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధించినట్టు!!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు