‘King of Kotha’: ఓనం కానుకగా దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dulquer Salman: పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ చిత్రసీమలోకి అడుగుపెట్టి 11 సంవత్సరాలు అవుతోంది. ఆ సందర్భంలో తెరకెక్కుతున్న దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్త’ను 2023 ఓనం రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం సెకండ్ లుక్ పోస్టర్ ఇప్పటికే అభిమానులను విశేషంగా ఆకట్టుకుని, సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అతని తొలి చిత్రం ‘సెకండ్ షో’లో అందరూ ఇష్టపడే గెటప్ లాగానే, అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ రగ్డ్ లుక్ తో ఈ పోస్టర్ అలరిస్తోంది. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కింగ్ ఆఫ్ కొత్త’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో జరుగుతోంది. అభిలాష్ ఎన్ చంద్రన్ రాసిన ఈ చిత్రం పాన్-ఇండియన్ స్టార్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. దీనికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎడిటర్ గా శ్యామ్ శశిధరన్ పని చేస్తున్నారు. జేక్స్ బిజోయ్ , షాన్ రెహమాన్ కలసి సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..