YVL N Shastri: పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) (75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేసేవారు.
'రైటర్ పద్మభూషణ్' చిత్ర బృందాన్ని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అభినందించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10న సికింద్రాబాద్ లో కాలుమోపారు. ఫిబ్రవరి 13న ఇక్కడ చారిత్రక ప్రసంగం చేశారు. దానిని 'వివేకానంద డే' గుర్తించాలని చేస్తున్న ఉద్యమానికి స్వర్గీయ కె. విశ్వనాథ్ మద్దతు పలికారు. అదే ఆయన చివరి సంతకం కూడా!
'మాలికాపురం' చిత్రంతో వందకోట్ల క్లబ్ లో చేరిన మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. 'గంధర్వ జూనియర్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు అంతే వాడీవేడీగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బదులిచ్చాడు. యేడాది గడిచినా 'కశ్మీర్ ఫైల్స్' చిత్రం అర్బన్ నక్సలైట్స్ కు కంటికి కునుకు లేకుండా చేస్తోందని కౌంటర్ ఇచ్చాడు.
వర్థమాన కథానాయకుడు విశ్వ కార్తికేయ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. అతను నటించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'అల్లంత దూరాన...' సినిమాతో పాటే క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఐపీఎల్' కూడా ఈ నెల 10న జనం ముందుకు వస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ సెట్ లో చిరంజీవితో పాటు 200 మంది డాన్సర్స్ పై ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.
యశ్వంత్, రాకింగ్ రాకేష్ హీరోలుగా నటించిన సినిమా 'ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ'. సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు నిర్దేశకత్వంలో దీన్ని తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించారు.
లాస్ట్ వీకెండ్ మొత్తం ఏడు చిత్రాలు విడుదల కాగా, ఇప్పుడు వాటికి మరో రెండు జతై తొమ్మిది చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'అమిగోస్'. ఇది హిట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ కొట్టినట్టే!