సాయి రోనక్, అవిగా గోర్ జంటగా నటించిన 'పాప్ కార్న్' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంతో మురళీ నాగ శ్రీనివాస్ గంథం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
రవితేజ 'నేనింతే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శియా గౌతమ్ హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్ గా రెండు రోజుల క్రితం పెళ్ళిచేసుకుంది. అమ్మడు సోషల్ మీడియాలో పెళ్ళి ఫోటోలు పోస్ట్ చేస్తే కానీ ఈ విషయం బయటపడలేదు!
దర్శకరత్న దాసరి నారాయణ కోసం రిజిస్టర్ చేసిన 'దేశం కోసం' అనే టైటిల్ ను రవీంద్ర గోపాల కోరడంతో ఇచ్చేశానని నిర్మాతల మండలి అధ్యక్షుడి సి. కళ్యాణ్ తెలిపారు. భగత్ సింగ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 10వ తేదీ విడుదల కాబోతోంది.
'రైటర్ పద్మభూషణ్' చిత్రం బృందం బుధవారం మహిళల కోసం ఉచితంగా తమ చిత్రాన్ని ప్రదర్శించబోతోంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలో 38 థియేటర్లను ఎంపిక చేసింది.
రామ్ పోతినేని 'నేను శైలజ'లో నటించిన ప్రిన్స్ కు ఇప్పుడు మరో ఛాన్స్ దక్కింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో ప్రిన్స్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు.
ఫైట్ మాస్టర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న కొత్తలో కవలలైన రామ్ - లక్ష్మణ్ హీరోలుగా రెండు మూడు సినిమాలు చేశారు. ఇప్పుడు వారి బాటలోనే రామకృష్ణ, హరికృష్ణ నడువబోతున్నారు. తన కుమారులతో తండ్రి తిరుపతి శ్రీనివాసరావు ఓ సినిమాను ప్రారంభిస్తున్నారు.
క్రికెట్, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన 'ఐపీఎల్' మూవీ ఈ నెల 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినీ ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తెరకెక్కించిన తాజా చిత్రం 'యూనివర్సిటీ'. విద్యావ్యవస్థలోని లోటుపాట్ల నేపథ్యంలో ఆయన రూపొందించిన ఈ సినిమా లోగోను డాక్టర్ బ్రహ్మానందం ఆవిష్కరించారు.
ప్రిన్స్ మహేశ్ బాబు 'రైటర్ పద్మభూషణ్' చిత్రాన్ని చూశారు. అనంతరం తన ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదని మహేశ్ కితాబిచ్చారు.