ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కో-స్టార్, 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ను ట్వీట్టర్ లో బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని స్క్రీన్ షాట్ తో సహా పోస్ట్ చేస్తూ అమ్మడు వాపోతోంది.
విజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన 'అన్ స్టాపబుల్' మూవీలోని ఫస్ట్ సింగల్ ను హీరో గోపీచంద్ విడుదల చేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రజిత్ రావు నిర్మించారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లోని 12మంది కంటెస్టెంట్స్ ను నందమూరి బాలకృష్ణ ర్యాప్ సాంగ్ పాడి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఆ పన్నెండు మందితో కలిసి బాలయ్య బాబు స్టెప్పులేని ఆకట్టుకున్నారు. దీంతో ఈ సీజన్ కు సరికొత్త జోష్ యాడ్ అయ్యింది.
'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ హీరోగా నటించిన 'సత్తిగాని రెండెకరాలు' చిత్రం విడుదల వాయిదా పడింది. ఆహా లో ఈ మూవీ ఏప్రిల్ 1న స్ట్రిమింగ్ అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తెలిపారు.
ఈ శుక్రవారం తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలతో పాటు రెండు అనువాద చిత్రాలు వస్తున్నాయి. అందులో ఉపేంద్ర 'కబ్జా' పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటం విశేషం.
ఇప్పటికే ఒకటి రెండు చిత్రాలలో కీ-రోల్స్ ప్లే చేసిన సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ హీరోగా పి. విమల ఓ సినిమా నిర్మిస్తున్నారు.
కృష్ణవంశీ 'రంగమార్తాండ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఉగాది కానుకగా ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ ను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ పొందడం విశేషం.
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'సార్' చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా సాగుతోంది. ఈ సినిమా విజయంతో ఫిబ్రవరి నెల ఈ సంస్థకు అచ్చివచ్చినట్టు అనిపిస్తోంది.