పలు విజయవంతమైన చిత్రాలకు మేకప్ మ్యాన్ గా వర్క్ చేసిన బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'మాధవే మధుసూదనా'. ఈ సినిమాలోని తొలి గీతాన్ని నాగ చైతన్య ఆవిష్కరించారు.
ఈ యేడాది ఇప్పటికే కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' విడుదలైంది. 'మీటర్ మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. తాజాగా కిరణ్ అబ్బవరం మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు.
నాలుగు కథలను, నలుగురు దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమా 'థర్డ్ ఐ'. సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, మాధవిలత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అమెరికాలోని యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోంది.
ఆదిసాయికుమార్ నటించిన తాజా చిత్రం 'సి.ఎస్.ఐ. సనాతన్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. శుక్రవారం జనం ముందుకొస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లో జరిగింది.
'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' మూవీకి కళ్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని 'కనుల చాటు మేఘమా' పాటకు విశేష ఆదరణ లభించడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఇప్పుడు డైలీ సీరిస్ ప్రసారమూ జరుగుతోంది. తాజాగా 'మందాకిని' సీరిస్ ను స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సోషియో ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఆర్.కె. మలినేని దర్శకత్వంలో వరుణ్ చౌదరి గోగినేని నిర్మించారు.
గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించిన 'ఆగస్ట్ 16, 1947' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఆరు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాను ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వంలో ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించారు.