Game on: గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా చిత్రం ‘గేమ్ ఆన్’. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా లోని ‘రిచో రిచ్…’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ”దా చిన్నా కూర్చో నీకో కథ చెపుతా… అనగనగా ఊళ్ళో కుర్ర కథ… బాధలన్నీ నిండి ఉన్న బుర్ర కథ…” అంటూ సాగే ఈ గీతాన్ని అసుర రాసి, రిక్కీలో కలిసి ఆలపించారు. ఈ పాట విడుదల సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, “గతంలో మేం విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్ అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ ద్వారా మ్యూజిక్ ను ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నాం. ప్రోమో కు కూడా మంచి స్పందన వచ్చింది. ఇన్‌టెన్స్ క్యారెక్టర్స్ మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ ఇది. హీరో ఒక లూజర్ గా తన లైఫ్ లో మిగిలిపోతున్న టైమ్‌లో, తన లైఫ్‌లో ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. అతన్ని ఆ గేమ్ ఏ లెవల్‌కు తీసుకెళుతుందనేదే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ ‘‘రొటీన్ కు భిన్నంగా ఉండే చిత్రమిది. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవలోనే మా ‘గేమ్ ఆన్’ సినిమా ఉంటుందని భావిస్తున్నాను. చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్ ఇందులో ఉంటాయి. మేం చెప్పిన కథను నమ్మి సినిమా చెయ్యడానికి వచ్చిన నిర్మాతకు థ్యాంక్స్. తను ఆస్ట్రేలియా లో ఉన్నా కూడా ఎంతో యాక్టీవ్ గా ప్రతి విషయంలో అప్డేట్ లో ఉంటాడు. మా బ్రదర్ పై నమ్మకం పెట్టి ఈ కథ రాసుకుని, డైరెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాకు హీరోగా, డైరెక్టర్ గా మేము ఇద్దరు అన్నదమ్ములం పోటీగా వర్క్ చేస్తున్నాం. ఈ సినిమాలోని యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్… అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉంది” అని అన్నారు.