Friday Releases: ఈవారం థియేట్రికల్ రిలీజెస్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: ఈ నెల 3వ తేదీన విడుదలైన ‘బలగం’ తర్వాత ఆ స్థాయిలో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసి థియేటర్లలో సందడి చేసిన సినిమాలేవీ రాలేదు. గత వారం వచ్చిన ఆది సాయికుమార్ ‘సి.ఎస్.ఐ. సనాతన్’తో సహా మిగిలిన ఐదారు సినిమాలు కూడా ఎలాంటి హడావుడీ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో 17వ తేదీ నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో రెండు అనువాదచిత్రాలు కాగా, మరో రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు. నాగశౌర్య, మాళవిక నాయర్ రెండో సారి జంటగా నటిస్తున్న సినిమా ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం రాబోతున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలానే `దుర్మార్గుడు` ఫేమ్ విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `గణా`. సుకన్య, తేజు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా కూడా ఫ్రై డే వస్తోంది.
ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే… కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకు నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర సుపరిచతుడు. ఆయన హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది ‘కబ్జా’ చిత్రం. పునీత్ రాజ్ కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రేపు రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై తెలుగులో విడుదల అవుతోంది. అలానే ఆంగ్ల చిత్రం ‘షజామ్ : ప్యూరీ ఆఫ్ ది గాడ్స్’ కూడా తెలుగులో డబ్ అయి శుక్రవారం రాబోతోంది. మరి ఈ నాలుగు సినిమాలలో ప్రేక్షకులు దేనికి ఓటు వేస్తారో చూడాలి.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!