Unstoppable: ‘బుల్ బుల్ అన్ స్టాపబుల్’ సాంగ్ రిలీజ్ చేసిన గోపీచంద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand: ”పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం-ఆడోరకం” వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న డైమాండ్ రత్నబాబు ఇటీవల దర్శకుడిగానూ మారాడు. ‘బుర్రకథ, సన్నాఫ్ ఇండియా’ చిత్రాలను తెరకెక్కించాడు. తాజాగా హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’ను రూపొందించాడు. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అన్ స్టాపబుల్’ టీజర్ కు చక్కని స్పందన లభించింది.
తాజాగా ‘అన్ స్టాపబుల్’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు మేకర్స్. ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ అన్ స్టాపబుల్’ ని మాచో స్టార్ గోపీచంద్ లాంచ్ చేశారు. ఈ పాటని ఫుట్ ట్యాపింగ్ డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు భీమ్స్. ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలసి భీమ్స్ ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం క్యాచిగా వుంది. విజె సన్నీ, సప్తగిరి చేసిన మాస్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. బిత్తిరి సత్తి , షకలక శంకర్, పృథ్వీ, డిజే టిల్లు మురళి, సూపర్ విమన్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూపలక్ష్మీ, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్ చక్రపాణి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Also Read
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!