కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా నిత్యం వంటల్లో ఉపయోగించే వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకాయి. సామాన్యుడికి వంటనూనెను కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా మారింది. వంటనూనెను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, విదేశాల్లో సోయాబీన్స్, పామాయిల్ ను బయోఉత్పత్తుల కోసం వినియోగిస్తుండటంతో ధరలు పెరిగాయి. ప్రస్తుతం కొత్త పంట చేతికి వస్తుండటంతో కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. పామాయిల్ పై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 2.5 […]
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా నిలదొక్కుకున్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. కరోనా ఎలా వస్తుంది. దాని వలన వచ్చే ఇబ్బందులు ఎంటి? కరోనా అంటే ఎంటి… ఎలా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది… క్వారంటైన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను విద్యార్థులకు బోధించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్దమైంది. 11 వ తరగతిలోని హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌లో పాఠ్యాంశంగా బోధించనునన్నారు. 11 వ తరగతికి […]
వినాయక చవితి వచ్చింది అంటే వివిధ రూపాల్లో మండపాల్లో గణనాథులు కొలువుదీరుతారు. ఒక మండపంలో ఉండే గణేషుని విగ్రహ రూపం ఒకలా ఉంటే మరోక చోట మరో రూపంతో విగ్రహం కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని తన పాదాల కింద అణగదొక్కుతున్న రూపంలో గణపతి దర్శనం ఇస్తున్నాడు. అయితే, పంజాబ్‌లోని లూథియానాలోని గణపతి ఇప్పుడు అందర్ని అకట్టుకుంటున్నాడు. ఆ గణపతిని తయారు చేయడానికి 200 కిలోల డార్క్ చాక్లెట్‌ను వినియోగించారు. ఈ డార్క్ చాక్లెట్ […]
ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి, వాతావరణ మార్పుల నిర్వహణ విషయంలో తప్పుడు దోవలో పయనిస్తున్నాయని ఐరాస జనరల్ సెక్రటరి అంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న దేశాలు 2022 ప్రధమార్థం నాటికి ప్రపంచంలో 70శాతం మంది జనాభాకు వ్యాక్సిన్‌ను అందించే లక్ష్యంగా ఉత్పత్తిని పెంచాలని అన్నారు. అయితే, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఉత్పత్తిని వేగవంతం చేయలేకపోయామని అన్నారు. ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక వాతావణంలో […]
ఈరోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా గజ్వేల్‌లో సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డుమ్మాకొట్టారు. పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి జగ్గారెడ్డి హాజరుకాకపోవడంపై ఇప్పుడు పలువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక […]
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈరోజు రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతో పాటుగా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే తలంపుతో తాను రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి అనగా పదవి నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆయన తప్పుకోవడానికి పటేల్ వర్గం వ్యతిరేఖతే కారణమని తెలుస్తోంది. గుజరాత్‌లో పటేల్ వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి ఓటు బ్యాంకింగ్ ఏ పార్టీకైనా సరే చాలా అవసరం. 2017లో […]
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. 2017 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకున్నది. అయితే, ఈసారి ఆ పార్టీకి కొంత ఎదురుగాలి విస్తుండడంతో, దానిని తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర పేరుతో యాత్ర చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయాత్తం అవుతున్నది. […]
వచ్చే ఏడాది దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పెద్దరాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లు ఉన్నాయి. అయితే, ముందస్తు సర్వే గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లో మరోసారి కాషాయం పార్టీకి పట్టంగట్టే అవకాశం ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పీసీసీలో ప్రక్షాళన చేసింది. ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్‌ను కొనసాగిస్తూనే పార్టీ పగ్గాలను మాత్రం […]
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,28,795కి చేరింది. ఇందులో 19,99,651 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 15,157 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1090 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనాతో 17 మంది మృతి చెందినట్లు […]