Oppo K15 Turbo Pro: ఓప్పో (OPPO) కంపెనీ తన గేమింగ్ ఫోకస్డ్ ‘K టర్బో’ సిరీస్‌లో నెక్స్ట్ మోడల్‌గా భావిస్తున్న ఓప్పో K15 టర్బో ప్రో గురించి కొత్త లీక్‌లు బయటికి వచ్చాయి. ఈ లీక్‌ల ప్రకారం ఫోన్ ప్రాసెసర్ విషయంలో ఓప్పో ఒక పెద్ద మార్పు చేస్తుందని తెలుస్తోంది. గతంలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉంటుందని అంచనాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌తో రావచ్చని తెలుస్తోంది.
ఈ ఫోన్ గేమింగ్ ప్రియులకు ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. 6.78 అంగుళాల ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్‌తో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాతో పాటు 8,000mAh లేదా అంతకంటే ఎక్కువ బైటిరి కెపాసిటీ ఉండవచ్చు. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఫీచర్ కూడా కొనసాగుతుంది. ఓప్పో K టర్బో సిరీస్ ఇప్పటికే బిల్ట్-ఇన్ ఫ్యాన్ కూలింగ్‌తో ప్రసిద్ధి చెందింది.
Bollywood : రూ. 15 కోట్ల నుండి రూ. 50 కోట్లకు పెరిగిన యంగ్ హీరో రెమ్యునరేషన్
గత లీక్‌లో ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ 9500sకి మార్పు చేస్తున్నారని కొత్త సమాచారం. ఈ మార్పు ఓప్పో ప్రాసెసర్ స్ట్రాటజీలో మార్పును సూచిస్తుంది. డైమెన్సిటీ 9500s అనేది ఇంకా అధికారికంగా ప్రకటించని కొత్త చిప్‌సెట్. ఇది హై-పెర్ఫార్మెన్స్ గేమింగ్‌కు సరిపడేలా రూపొందించబడి ఉండవచ్చు. అయితే, డైమెన్సిటీ 9500s అండ్ 9500e వేరియంట్‌లు వచ్చే అవకాశం ఉందని, ఇది కొనుగోలుదారులలో గందరగోళం సృష్టించవచ్చని హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయని భావిస్తున్నారు టెక్ ప్రియులు. రాబోయే కాలంలో గేమింగ్ ఫోన్ ప్రియులకు ఇది ఆకర్షణీయ ఆప్షన్‌గా మారవచ్చు.