ఈరోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా గజ్వేల్‌లో సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డుమ్మాకొట్టారు. పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి జగ్గారెడ్డి హాజరుకాకపోవడంపై ఇప్పుడు పలువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక అలస్యంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని, దండోరా సభను హుజురాబాద్‌లో ఎందుకు పెట్టడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా సమావేశానికి పిలవాలని జగ్గారెడ్డి పార్టీని కోరారు. వీటిపై పార్టీ స్పందించకపోవడంతో జగ్గారెడ్డి సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.
Read: పటేల్ వర్గంవైపే బీజేపీ అధిష్టానం మొగ్గు… ఎందుకంటే…