తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లపై సదస్సు జరిగిందని, దీనిని ఎలా తప్పు పడతారని ఎమ్మెల్యే కేశవ్ పేర్కొన్నారు. కాల్వ శ్రీనివాసులపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే కేశవ్ కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రి రాజకీయాలు ఇక్కడ చేస్తే తిరుగుబాటు […]
గణేష్ చతుర్థి సందర్భంగా నగరంలో భారీ గణనాథులను ఏర్పాటుచేశారు. మూడో రోజు నుంచి గణపతుల నిమర్జన కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఈరోజున నిమర్జనం కావాల్సిన విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందని, హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం హౌస్ […]
స్కేటింగ్ గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆడాల్సిన గేమ్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాళ్లు చేతులు విరిగిపోతాయి. చిన్నపిల్లలు, యువత ఎక్కువగా ఈ గేమ్‌ను అడుతుంటారు. అయితే, రష్యాకు చెందిన 73 ఏళ్ల ఇగోర్ అనే పెద్దమనిషి స్కేటింగ్ లో తన స్కిల్స్‌ను ప్రదర్శించి భళా అనిపించాడు. 73 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ఇగోర్ తన ప్రతిభను ప్రదర్శించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నది. ప్రతిభకు […]
ఏలియన్లు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాలు విశాలమైన విశ్వంలో చాలా ఉన్నాయని అయితే, వాటిని గుర్తించడం ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2 వ తేదీన అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఓ నల్లని వస్తువు కనిపించిందని, దీని నుంచి రేటియో సిగ్నల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. 1930 నుంచి ఆ నల్లని వస్తువు నుంచి సిగ్నల్స్ వస్తున్నాయని […]
గుజరాత్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా చేసుకొని బీజేపీ ఎత్తులు వేస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ పటేల్ వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆప్ కూడా తన మనుగడ చాటుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుజరాత్‌లో పారిశ్రామిక నగరమైన సూరత్‌లో ఆ పార్టీ బలంగా ఉన్నది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 20 వార్డులు గెలుచుకొని తన ఉనికిని చాటుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో […]
హైదరాబాద్‌లో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన వందలాది గణపతి మండపాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమర్జనానికి అనుమతిని నిరాకరిస్తూ ఈ నోటీలుసు ఇచ్చిరు. హైకోర్టు ఆదేశాలతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై రేపు తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను […]
ప్రధాని మోడి ఈరోజు ఉదయం పారాఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. పతకాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. క్రీడకలకు అంగవైకల్యం అడ్డుకాదని, దీనికి ఉదాహరణ పతకాలు సాధించిన క్రీడాకారులే అని ప్రధాని మోడీ ఈ సందర్బంగా పేర్కొన్నారు. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరిని ప్రధాని పలకరించారు. ప్రధానిని కలిసినందుకు క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. Read: తాలిబన్ల విజయం వారికి మరింత బలాన్నిస్తుందా…?
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చారు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్లు ఆఫ్ఘన్‌లో అరాచక పాలన సృష్టించారు. ఈ పాలన తరువాత, అమెరికా దళాలు ఆఫ్ఘన్‌లోని ముష్కరులపై దాడులు చేసి తాలిబన్లను తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. 20 ఏళ్లపాటు అమెరికా, నాటో దళాలు అక్కడే ఉన్నాయి. 2021 ఆగస్టు 31 వరకు పూర్తిగా అమెరికన్ దళాలు ఆఫ్ఘన్‌ను వదలి వెళ్లిపోయాయి. దీంతో మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు […]
గుజరాత్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ బీజేపీ ప్రభుత్వం బలంగానే ఉన్నది. అయితే, పటేల్ వర్గం నుంచి కొంత వ్యతిరేకత వస్తుండటంతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది బీజేపీ. ఎన్నికల్లో పటేల్ వర్గానికి అత్యధిక ఓటు బ్యాంకు ఉంటుంది. వీరి ఓట్లే కీలకం కావడంతో వీరిని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే గుజరాత్ ముఖ్యమంత్రిని మార్పు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. విజయ్ రూపానీ జైన్ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటుగా, […]