ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. నిత్యవసర వస్తువుల డోర్ డెలివరీ నుంచి పక్కకు తప్పుకున్నది. కరోనా నుంచి కోలుకుంటుండటంతో ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతున్నది. నిత్యవసర వస్తువుల డోర్ డెలివరీ కంటే, ఫుడ్ డెలివరీకే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో నిత్యవసర సేవల డోర్ డెలివరీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. గతేడాది ఓసారి ఈ నిర్ణయం తీసుకోగా, జులై నెలలో ఈ సేవలను తిరిగి ప్రారంభించింది. అయితే, […]
దెయ్యం ఎలా ఉంటుంది అంటె ఫలానా అకారంలో ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అయితే, అవి ఉన్నచోట కొన్ని వస్తువులు ఆటోమాటిక్‌గా కదులుతుంటాయి. చాలామంది దెయ్యాలు ఉన్నాయంటే అసలు నమ్మరు. దెయ్యాలను నమ్మని ఓ మహిళ లండన్‌లోని ది లాన్స్ డౌన్ అనే పబ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన ఆ మహిళ ఓ కుర్చీలో కూర్చున్నది. టేబుల్ చుట్టూ ఉన్న మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నయి. ఎన్నట్టుండి ఎదురుగా ఉన్న కుర్చీ ముందుకు కదిలింది. దీంతో […]
గుజరాత్ సీఎంగా నేడు భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గుజరాత్ 17 వ సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. పటేల్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా భూపేంద్ర పటేల్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తున్నారు. తెరపైకి నితిన్ పటేల్, వ్యవసాయ శాఖ మంత్రితో పాటు, కొంతమంది కేంద్రమంత్రుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ […]
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పాటుగా మరికొన్ని వేరియంట్లు అక్కడ చైనాలో వెలుగుచూస్తున్నాయి. దీంతో మరోసారి ఆంక్షలు విధేంచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అయింది. పూజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ నగరంలో 19 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆ నగరంలో ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి ఆ నగరాన్ని పూర్తిగా మూసివేశారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసరంగా ఎవరైనా బయటకు రావాలి అంటే […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైంది. మహిళల విషయంలో తాలిబన్లు కాస్త మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. చదువుకునేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఇక, ఉద్యోగాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, కొంత మంది మహిళలు ధైర్యంతో ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్ తిరిగి తెరుచుకోవడంతో అక్కడ 12 మంది మహిళలు తిరిగి ఉద్యోగాల్లో చేరారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోని చెకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఈ మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబం పోషణ జరగాలంటే ఉద్యోగం చేయాలని, ఉద్యోగానికి […]
మేషం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారానికి బాగా శ్రమిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. స్త్రీలు షాపింగ్ విషయాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. వృషభం : మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, బేకరీ తినుబండారాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, కీలకమైన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. […]
ఉత్తరభారతంలో మెల్లిగా ఎన్నికల వేడి రగులుకుంటోంది. వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఐదేళ్ల కాలంలో మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చింది. గతంలో బీజేపీలో ఉండి ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరిన నేతలను తిరిగి బీజేపీలో చేరే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. పురోలా నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ […]
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 100 చోట్ల పోటీ చేసేందుకు శివసేన సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు మహారాష్ట్రకు పరిమితమైన శివసేన పార్టీని విస్తరించుకోవడానికి సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగానే యూపీలో పశ్చిమ భాగం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నది. యూపీ పశ్చిమ రైతులు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తప్పకుండా పోటీ చేసి తమ ప్రభావం చూపుతామని శివసేన ఎంపీ సంజయ్ […]
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్ ఎంపికయ్యారు. ఈరోజు గుజరాత్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చించారు. భూపేంద్రభాయ్ పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. 2017లో జరిగిన ఎన్నికల్లో భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్ అత్యథిక మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై 1,17,000 ఓట్ల మెజారిటీతో భూపేంద్రభాయ్ పటేల్ విజయం సాధించారు. పటేల్ సామాజిక […]
అమెరికాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత లేనప్పటికీ మతపరమైన కారణాలు, ఇతర సొంత కారణాల వలన వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై వివక్ష మొదలైంది. ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కొన్ని ట్యాక్సీ సంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా […]