ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్! అన్నారు చిలకమర్తి వారు. కానీ ఇవాళ ఆడవాళ్ళు ఎవరూ ముద్దుగా నేర్పించకుండానే విద్యలన్నీ ఒంటపట్టించుకుంటున్నారు. అందుకు బిగ్ బాస్ సీజన్ 5లో ఫస్ట్ కెప్టెన్ గా ఎంపికైన సిరినే పెద్ద ఉదాహరణ. బిగ్ బాస్ హౌస్ లో 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన విశ్వ, మానస్, సిరి, హమీదా… కెప్టెన్ అయ్యే అర్హతను పొందారని […]
తాలిబన్ల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో కొలువుదీరింది. సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందరిని సమానంగా గౌరవిస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తాలిబన్లు చెప్పింది ఒకటి చేసింది ఒకటిగా మారింది. తాలిబన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చోటు కల్పిస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు అంటే ఉగ్రవాదులు, కిడ్నాపులు చేసిన వారు, హత్యలు చేసినవారు అని అర్ధం కాబోలు. అందుకే ఆ ప్రభుత్వంలో తాలిబన్ ఫైవ్‌కు చోటు కల్పించింది. ఉగ్రవాద నేర చరిత కలిగిన అబ్దుల్ హక్ […]
ఈరోజు దేశ చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు హైవేలు ఎంత వరకు ఉపయోగపడతాయి అనే విషయంపై ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. రాజస్థాన్‌లోని జలోర్ హైవేపై సీ 130 సూపర్ హెర్క్యులస్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానం నేషనల్‌హైవేపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఫీల్డ్‌పై ల్యాండ్ అయింది. రక్షణశాఖకు చెందిన ఈ ట్రాన్స్‌పోర్ట్ విమానంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారి, ఎయిర్ […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కొలువుదీరింది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చైనా తామున్నామని హామీ ఇచ్చింది. హామీతో పాటుగా ఆ ప్రభుత్వానికి రూ.229 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా అందించింది. ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి చైనా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. పాక్ అనుకూల వర్గం చేత ఈ పని చేయిస్తున్నది చైనా. అటు రష్యాకూడా ఆఫ్ఘన్ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నది. రష్యాకు ఆక్రమణలకు వ్యతిరేకంగా ఏర్పటిన సంస్థే తాలిబన్. రష్యా సేనలు […]
వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ నుంచి గతంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేశారు. ఇప్పుడు రైతులు బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. కర్నాల్ లో రైతులు రోడ్డు మీదకు చేరుకొని నిరసనలు […]
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. హిందువులకు ఇది తొలి పండుగ. ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముంబై, హైదరాబాద్ తరువాత బెంగళూరు నగరంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలపై కరోనా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే, బెంగళూరు నగరంలో వినాయక […]
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. నిన్నటి రోజున 43 వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 43 వేల కేసుల్లో 30 వేలకు పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 180 మంది కరోనాతో మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే, మహారాష్ట్ర రాజధాని ముంబైని మళ్లీ కరోనా భయపెడుతున్నది. ముంబై నగరంలో నిన్నటి రోజున 500 లకు పైగా కేసులు నమోదయ్యాయి. జులై 15 […]
తమిళనాడులో చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఓటమిపాలైంది. ఈ ఎన్నికలకు ముందు తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. జైలునుంచి రిలీజ్ అయ్యాక అన్నాడీఎంకేలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించగా కుదరలేదు. అనుకూల వర్గం కూడా ఆమెకు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇటీవలే తమిళనాడు […]
తెలుగు పాటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. భాష తెలియకున్నా సంగీతాభిమానులు కమ్మనైన తెలుగు పాటలను నేర్చుకొని ఆలపిస్తుంటారు. అటువంటి పాట ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెంట్ అవుతున్నది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో కేవీ మహదేవన్ సంగీత సారథ్వంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ‘విధాత తలపున…’ అనే పాట ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. లెజెండ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను ఇప్పుడు దుబాయ్‌కు చెందిన ఓ షేక్ […]
ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు నిత్యం ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంతో గడిపేందుకు కూడా వారికి సమయం దొరకదు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ పాలన విషయంలో నిత్యం బిజీగా ఉండే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ బుధవారం రోజుజ గరిటె పట్టాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా రకరకాల వంటలు చేశారు. మటన్ […]