ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి, వాతావరణ మార్పుల నిర్వహణ విషయంలో తప్పుడు దోవలో పయనిస్తున్నాయని ఐరాస జనరల్ సెక్రటరి అంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న దేశాలు 2022 ప్రధమార్థం నాటికి ప్రపంచంలో 70శాతం మంది జనాభాకు వ్యాక్సిన్‌ను అందించే లక్ష్యంగా ఉత్పత్తిని పెంచాలని అన్నారు. అయితే, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఉత్పత్తిని వేగవంతం చేయలేకపోయామని అన్నారు. ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక వాతావణంలో మార్పులు, వాతావరణం కలుషితం కారణంగా వస్తున్న దుష్ప్రభావాలపై నవంబర్‌లో స్కాట్‌లాండ్‌లో సమావేశం జరగబోతున్నది. కరోనా కారణంగా ఆ సదస్సును వాయిదా వేయాలని దేశాలు కోరుతున్నాయని, కానీ, వాతావరణంలో మార్పుల అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందని, కాలుష్యానికి కారణమౌతున్న అమెరికా, చైనాలు ఈ విషయంలో సహాయం చేయాలని గుటెర్రస్ పేర్కొన్నారు.
Read: పీసీసీ సమావేశానికి జగ్గారెడ్డి డుమ్మా… కారణం ఇదేనా…