Payal Rajput: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శివాజీ మాటలపై ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. నటుడు శివాజీ మహిళల దుస్తులు, సంప్రదాయ దుస్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, సెన్స్ లేని దుస్తులు ధరించడం సరికాదని చెబుతూనే.. ‘సామాన్లు ప్రదర్శించడం’ వంటి పదాన్ని ఉపయోగించాడు. ఇక అంతే.. ఓ వర్గ మహిళల మనోభావాలు తెగ దెబ్బ తిన్నాయి. ఈ వ్యాఖ్యలతో పలువురు మహిళల ప్రముఖులు.. మహిళలని కించపరిచారంటూ విమర్శలు గుప్పించారు.
Virat Kohli: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. లిస్ట్-Aలో 16,000 పరుగుల మైలురాయి..!
ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి శ్రీపాడ తీవ్రంగా స్పందించింది. ఇంకా మనోజ్ మంచు, అనసూయ భరద్వాజ్ వంటి ఇతర సెలబ్రిటీలు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. టాలీవుడ్‌లోని 100 మందికి పైగా మహిళా ప్రొఫెషనల్స్ తరఫున ‘వాయిస్ ఆఫ్ విమెన్ టీఎఫ్‌ఐ’ సంస్థ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు లేఖ రాసింది. ఇప్పుడు ఈ వివాదంలోకి కొత్తగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా ఎంటర్ అయ్యింది.
Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ ఊచకోత.. ముంబై భారీ విజయం..!
పాయల్ రాజ్‌పుత్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసి, తన భావాలను వ్యక్తం చేసింది. “నా ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడం ఓకే అనుకుంటున్నాను. నటుడు శివాజీ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై మహిళలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు విని అసౌకర్యంగా అనిపించిందని అన్నారు. ముఖ్యంగా మహిళలపై ఆయన కామెంట్స్ నన్ను అసహనానికి గురిచేశాయని.. మహిళల దుస్తుల ఎంపికలు వ్యక్తిగతమని, పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో అలాంటి కామెంట్స్ సరికాదని సూచిందింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు పాయల్‌ను మద్దతిస్తుండగా.. మరికొందరు శివాజీ వ్యాఖ్యలను తప్పుగా మలుస్తున్నారని వాదిస్తున్నారు.
I hope it's okay to express my feelings. I felt uncomfortable hearing some remarks about women made by Shivaji Garu on a public platform.
I must admit it made me feel uneasy, especially regarding his comments on women. #weknowbetter 🙏🏼 pic.twitter.com/eDfXsLT4Hv— paayal rajput (@starlingpayal) December 24, 2025