ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. 2017 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకున్నది. అయితే, ఈసారి ఆ పార్టీకి కొంత ఎదురుగాలి విస్తుండడంతో, దానిని తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్ర పేరుతో యాత్ర చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయాత్తం అవుతున్నది. 12వేల కిలోమీటర్లమేర పార్టీ యాత్ర చేపట్టబోతున్నది. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఈ యాత్రను చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని ప్రజలకు తెలియజేసేందుకు, వారికి హామీలు ఇచ్చేందుకు యాత్ర చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ స్పష్టం చేసింది. అటు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు కూడా బీజేపీకి వస్తున్న వ్యతిరేఖతను తమవైపు మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే, ముందస్తు సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నాయి.
Read: ఏపీ కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు: సంక్రాంతి లోపు ముఖ్యమంత్రి మార్పు…!!