HMD Pulse 2: హెచ్‌ఎండీ (HMD) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో నెక్స్ట్ మోడల్‌గా HMD Pulse 2ని త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి అనేక విషయాలు లీక్ అయ్యాయి. హెచ్‌ఎండీ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా ఈ ఫోన్ కోడ్ నేమ్ M-Kopa X3తో రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంటుందని, ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని లీక్‌లో తెలిపారు.
ప్రాసెసర్ విషయంలో Unisoc T7250 చిప్‌సెట్ ఉంటుందని, కెమెరాల విషయంలో 50MP ప్రైమరీ సెన్సర్ (f/1.8 అపర్చర్), 2MP సెకండరీ సెన్సర్ తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా (f/2.0 అపర్చర్) ఉంటుంది. ర్యామ్‌గా 4GB, స్టోరేజ్‌గా 128GB ఇస్తారని.. అదనంగా 256GB వరకు మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంటుందని లీక్‌లో పేర్కొన్నారు.
MHSRB : మెరిట్ లిస్ట్ విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.!
మొబైల్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంటుంది. బ్యాటరీ విషయంలో 5,000mAh కెపాసిటీతో 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 5.0, NFC వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన HMD Pulse ధర సుమారు 140 యూరో (రూ.12,000 దాకా) ఉంది. HMD Pulse 2 మరింత మెరుగైన స్పెసిఫికేషన్స్‌తో బడ్జెట్ సెగ్మెంట్‌లో బలమైన ఆప్షన్‌గా మారవచ్చు. అయితే, ఇది కేవలం లీక్ మాత్రమే కాబట్టి.. అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాల్సి ఉంది.