Crime: ప్రాణం తీసిన బిర్యానీ..! ఎక్కువ ఉప్పు వేసిందని భార్య దారుణ హత్య
- ముంబైలో దారుణం..
- భార్యను హత్య చేసిన భర్త..
- బిర్యానీలో ఉప్పు ఎక్కువ అయ్యిందని హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ముంబైలో ఓ మహిళ హత్య సంచలనంగా మారింది.. బైంగన్వాడి ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆశ్చర్యకరంగా, ఈ ఘటనకు “బిర్యానీలో ఎక్కువ ఉప్పు” అని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మృతురాలి కుటుంబం, నజియా పర్వీన్ పోలీసులకు మాట్లాడుతూ, ఇది కేవలం ఒక రాత్రిలో జరిగిన ఘటన కాదంటున్నారు.. నజియా, మంజార్ రెండేళ్ల క్రితం, అక్టోబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు.. కానీ, వివాహం తర్వాత మంజార్ ప్రవర్తన మారిపోయింది. అతను తరచుగా చిన్న చిన్న విషయాలకే నజియాపై చేయి చేసుకునేవాడు.. దాదాపు మూడు నెలల క్రితం, మంజార్ క్రూరత్వం యొక్క అన్ని పరిమితులను కూడా దాటాడు, నజియాపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె పన్ను కూడా విరిగింది.
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన జరిగిన డిసెంబర్ 20వ తేదీ రాత్రి, నాజియా ఇంట్లో బిర్యానీ తయారు చేసింది. మంజార్ తినడానికి కూర్చున్నప్పుడు, బిర్యానీలో ఉప్పు గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఆ వాదన తీవ్రంగా మారిపోయింది.. మంజార్ సహనం కోల్పోయి నాజియా తలను గోడకు బలంగా మోదాడు. తలకు తీవ్ర గాయాలు, అధిక రక్తస్రావం కారణంగా నాజియా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.. ఇక, ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న శివాజీ నగర్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. నిందితుడైన భర్తపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సంబంధిత సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న మంజార్ ఇమామ్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!