సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం అందరికంటే ఓ మెట్టు ముందు ఉన్న సంగతి తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చేరేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నది ప్రభుత్వం. సంక్షేమ పాలన అందిస్తున్న ఏపీ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి, ఏపీ కాంగ్రెస్‌నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు అందిస్తున్న బియ్యంలో 50 శాతం ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారని, సీఎం కుర్చీ పోతుందన్న భయంతోనే జగన్ బయటకు రావడంలేదని అన్నారు. బోగి పండుగ లోపు ఏపీలో సీఎం మారిపోతారని చింతామోహన్ జోస్యం చెప్పారు. చింతా మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, అది కాంగ్రెస్ వలనే సాధ్యం అవుతుందని చింతా మోహన్ పేర్కొన్నారు.