కేటుగాళ్ళు ఎక్కవవుతున్నారు. నకిలీ పోలీసులు,నకిలీ రిపోర్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరి ఆటకట్టించారు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్ లలో నకిలీ ఎస్వోటీ పోలీసుల పేరుతో మాముళ్ళు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం,2 మొబైల్ ఫోన్స్,2 నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మోడెజబా మనిక్ (32),కొత్తగాడి అమర్నాథ్ […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏ దేశం ఆ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. అయితే, అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో మానవతా దృక్పధంతో ప్రజలను ఆదుకోవడానికి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. అందులో ఇండియా ప్రధమంగా ఉన్నది. ఇండియా చొరవతీసుకొని అక్కడి ప్రజలకోసం ఆహారధాన్యాలు ఇతర సహాయ సహకారాలు అందిస్తోంది. ఇతీవలే భారత్ 8 దేశాలతో చర్చలు జరిపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రధానాంశంగా ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిణామాలు, అక్కడి […]
దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం లో తెలంగాణ ప్రస్తావించిన అంశాలను వివరించారు హోంమంత్రి మహమూద్ అలీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకం అనుమతులు. జనవరి 15 లోపు డీపీఆర్ లు కేఆర్ఎంబీకి సమర్పించాలని..డీపీఆర్ ల ఆధారంగా సెంటర్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజీవ్ గాంధి సంగంబండ బ్యారేజ్ ద్వారా కర్ణాటక లో మునిగి పోనున్న ప్రాంతాల పై తెలంగాణ, కర్ణాటక ఉమ్మడి గా సర్వే నిర్వహించాలని నిర్ణయం. ఏపీకి తెలంగాణ రూ.6015 […]
మేషం :- చేనేత, నూలు, ఖాదీ, కలంకారీ వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అభిరుచులకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. ఎదుటి వారి నుండి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. విద్యార్థులకు తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారంలో ముఖ్యుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. ఫోం, పీచు, […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రి మండలిలో 77 మంది ఉన్నారు. ఈ 77 మంది మంత్రులను 8 గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్‌లోనూ కొంతమంది నైపుణ్యం ఉన్న యువకులను, రిటైర్డ్ అధికారులను నియమించనున్నారు. వీరి నుంచి సలహాలు తీసుకుని మెరుగైనా విధానాలను రూపొందించి అమలు చేయనున్నారు. మం త్రుల పారదర్శకతను పెంపొందించేందుకు ఈ నిపుణుల బృందం పనిచేస్తుందని తెలిపారు. మంత్రి మండలిని మొత్తం 8 గ్రూపులుగా విభజించే ప్రక్రియ […]
కోవిడ్ కేసులతో యూరప్ వణికిపోతుంది. గత వారం వ్యవధిలో దాదా పు 20 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలు ఒకే వారంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఆందోళన వ్యక్తం చే సింది. ఇదే వ్యవధిలో దాదాపు 27 వేల మరణాలు సంభవించినట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాలను లెక్కగడితే.. సగానికి పైగా ఇక్కడే నమోదైనట్టు పేర్కొంది. యూరప్‌లోని తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ […]
కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్‌లోని అన్ని పాఠశాలలను నవంబర్ 17 వరకు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలు చెత్త ను కాల్చడాన్ని కూడా నిషేధించింది. వాయు కాలుష్యం కార ణంగా నవంబర్ 15 నుండి ఒక వారం పాటు పాఠశాలలను మూసివే యాలని ఢిల్లీ ప్రభుత్వం కోరిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యమునా […]
భక్తి టీవీ కోటి దీపోత్సవం కనుల పండువగా సాగిపోతోంది. కార్తికమాసాన జంటనగరవాసుల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవం 3వ రోజు వేలాదిమంది ఎన్టీఆర్ స్టేడియానికి తరలివచ్చారు. మూడవరోజు కోటి దీపోత్సవానికి హాజరయ్యారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. వేదపండితులు ఆశీర్వాదాలు అందచేశారు. కోటి దీపోత్సవం ద్వారా ఎన్టీవీ, భక్తిటీవీ చేపడుతున్న సేవల్ని కొనియాడారు. ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్రచౌదరి దంపతుల్ని సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఇవాళ్టి కోటి దీపోత్సవంలో హర్యానా […]
పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. దీంతో స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు విద్యార్ధులు. సూర్యాపేట జిల్లాలో ఓ హెడ్మాస్టర్ విద్యార్దుల్ని లైంగికంగా వేధించాడు. చదువు చెప్పాల్సిన హెడ్మాస్టర్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఆ కీచకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధినులను ప్రిన్సిపాల్ అనిల్ లైంగికంగా వేధించాడు. చుట్టుపక్కల గ్రామాలు, తండాలు విద్యార్ధినులు ఇక్కడికి […]
నందమూరి అభిమానులకు పండగ మొదలయింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హైవోల్టేజ్ మూవీ అఖండ సినిమా ట్రైలర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ ఓ రేంజ్లో ఉంది. బాలయ్య ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండుగ రోజే.. “విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదల యింది. ఆ తర్వాత మొత్తం దుమ్మురేపే మాస్ సీన్లతో ట్రైలర్ సాగుతుంది. ” అంచనా వేయడానికి […]