భక్తి టీవీ కోటి దీపోత్సవం కనుల పండువగా సాగిపోతోంది. కార్తికమాసాన జంటనగరవాసుల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవం 3వ రోజు వేలాదిమంది ఎన్టీఆర్ స్టేడియానికి తరలివచ్చారు. మూడవరోజు కోటి దీపోత్సవానికి హాజరయ్యారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. వేదపండితులు ఆశీర్వాదాలు అందచేశారు.
కోటి దీపోత్సవం ద్వారా ఎన్టీవీ, భక్తిటీవీ చేపడుతున్న సేవల్ని కొనియాడారు. ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్రచౌదరి దంపతుల్ని సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఇవాళ్టి కోటి దీపోత్సవంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు.