దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం లో తెలంగాణ ప్రస్తావించిన అంశాలను వివరించారు హోంమంత్రి మహమూద్ అలీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకం అనుమతులు. జనవరి 15 లోపు డీపీఆర్ లు కేఆర్ఎంబీకి సమర్పించాలని..డీపీఆర్ ల ఆధారంగా సెంటర్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజీవ్ గాంధి సంగంబండ బ్యారేజ్ ద్వారా కర్ణాటక లో మునిగి పోనున్న ప్రాంతాల పై తెలంగాణ, కర్ణాటక ఉమ్మడి గా సర్వే నిర్వహించాలని నిర్ణయం.
ఏపీకి తెలంగాణ రూ.6015 కోట్ల విద్యుత్ బకాయిల అంశం పై రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలని నిర్ణయం. 9 వ షెడ్యూల్ లో ఉన్న సంస్థల రెండు రాష్ట్రాల మధ్య పంపకాలలో 23 సంస్థల పై అభ్యంతరం చెప్పిన తెలంగాణ … తెలంగాణ అభ్యంతరాలను వెంటనే పరిశీలించి తమ అభిప్రాయాలను ఏపీ చెప్పాలి. ఢిల్లీ AP భవన్ విభజన ప్రతిపాదనలు పరిశీలించి కేంద్రం స్పీడ్ గా పరిష్కరించాలి. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం లో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అనేక అంశాలను ప్రస్తావించారు.
వ్యవసాయ వృద్ధి, రైతుల ఆదాయం పెంచడం లో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.. రైతు బంధు పథకం అమలు చేస్తున్నాం… 24 గంటల కరెంట్ ఇస్తున్నాం.. ప్రాథమిక రంగం జాతీయ వృద్ధి తో పోలిస్తే తెలంగాణ 6 రేట్లు అధికంగా వృద్ధి సాధించిందన్నారు. మహిళలు, పిల్లల పై నేరాలు జరగకుండా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం.
షీ టీమ్స్ ఏర్పాటు చేశామని హోంమంత్రి సమావేశంలో వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య వున్న అనేక సమస్యలను విభజన చట్టం ప్రకారం పరిష్కరించుకున్నాం… మిగిలిన సమస్యలను కూడా రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యం గా పరిష్కరించుకుంటాం..కరోనా కాలం లో ప్రాణ నష్టం, జీవనోపాధి దెబ్బ తిన కుండా చూశాం. పేదల ఆరోగ్యం కోసం పథకాలను అమలు చేస్తున్నాం.