కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్‌లోని అన్ని పాఠశాలలను నవంబర్ 17 వరకు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలు చెత్త ను కాల్చడాన్ని కూడా నిషేధించింది. వాయు కాలుష్యం కార ణంగా నవంబర్ 15 నుండి ఒక వారం పాటు పాఠశాలలను మూసివే యాలని ఢిల్లీ ప్రభుత్వం కోరిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే యమునా నదిలో తీవ్ర స్థాయిలో కాలుష్యం వెలువడు తుంది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించాలని సుప్రీం కోర్టు ఢీల్లీ ప్రభుత్వానికి సూచించింది. కానీ ఢీల్లీ ప్రభుత్వం ఆ తరహాలో కాకుండా నివారణ చర్యలు చేపడుతుంది. ఇప్పుడు అదే బాటలో హర్యానా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసు కుంది. కాగా, ఢీల్లో పరిసర ప్రాంతాల్లో వ్యాపించిన వాయు కాలు ష్యం మూలంగా ఎంతో మంది శ్వాస కోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతు న్నారు. దీంతో ఆయా ప్రభుత్వాలు చిన్న పిల్లలు శ్వాస కోశ సంబం ధిత వ్యాధులకు గురికాకుండా ఉండేందుకు, కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.