నందమూరి అభిమానులకు పండగ మొదలయింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హైవోల్టేజ్ మూవీ అఖండ సినిమా ట్రైలర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంది. బాలయ్య ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండుగ రోజే.. “విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదల యింది. ఆ తర్వాత మొత్తం దుమ్మురేపే మాస్ సీన్‌లతో ట్రైలర్ సాగుతుంది. ” అంచనా వేయడానికి నువ్వేమైనా.. పోలవరం డ్యామా. .? పట్టిసీమ తూమా.. పిల్ల కాలువ” అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
“ఒకమాట నువ్వంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం.. దైవశాసనం” మీకు సమస్య వస్తే దండం పెడతాం..బోత్ ఆర్‌నాట్ సేమ్” అంటూ అఘోరా గెటప్‌లో బాలయ్య చెప్పే ఈ డైలాగ్ బాల య్య నట విశ్వరూపాన్ని గుర్తుకు తెస్తుంది. ” ఒకసారి డైసైడ్ అయి బరిలోకి దిగి దిగితే బ్రేకుల్లేని బుల్ డోజర్‌ని తొక్కి పార దొబ్బు తా..” అంటూ సాగే మరో మాస్ డైలాగ్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.
ట్రైలర్‌లో శ్రీకాంత్ మాస్ గెటప్ ఓ రేంజ్‌లో ఉంది. అలానే జగపతి బాబు ఎలివేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. జగపతి బాబు చెప్పే కళ్లు తెరిచి జూలు విదిలిస్తే అనే డైలాగ్ కూడా బాగా పండింది.
“సింహా”, “లెజెండ్” వంటి హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సిని మాపై భారీ అంచనాలున్నాయి. దీంతోపాటు ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇందులో బాలయ్యకు జోడిగా ప్రగ్యాజైస్వాల్ నటిస్తుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. డిసెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.