నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది బోధన్ రోడ్డు. ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నవారు ఎందరో. గత రెండున్నరేళ్ళుగా బోధన, బాన్స్ వాడ రోడ్డుని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో మరింతగా గుంతలు పడ్డాయి. గర్భిణీలు ఈ రోడ్డుపై వెళ్ళి ఆస్పత్రికి చేరాలంటే భయపడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వాటి అమలును మరిచిపోతున్నారు. దీంతో రోడ్డు పై ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజూ వందలాదిమంది […]
సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడిలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుం దన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీన నిర్ణయంతో విద్యార్థులే బలి పశువులుగా మారారని పవన్ ఆరోపించారు. విద్యార్థుల విషయంలో వారి భవిష్య త్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. వీటిలో ఎన్ని […]
ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు. నిత్యం వివాదాలమయంగా మారాయి ఇక్కడి ఎన్నికలు. అటు అధికార, విపక్షాలు ఇక్కడి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుప్పం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత ఇలాకా కావడంతో అక్కడ ప్రజాతీర్పు ఎలా వుంటుందోనని యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కుప్పం మున్సిపాలిటీ కి సంబంధించిన 24 వార్డులలో సోమవారం నాడు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎన్నికల అధికారి చిట్టిబాబు […]
తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ర్టాల సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపో వడం చర్చనీయాంశం అయింది. అతి ముఖ్యమైన ఈ సమావే శానికి కేసీఆర్ హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ర్టాల సాగునీటి ప్రాజెక్టులు, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలపై ముఖ్యంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి అందరూ సీఎంలు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ స్థానంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ […]
దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లకు ఎంతో చరిత్ర వుంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ రైల్వే స్టేషన్‌కు 18వ శతాబ్ధకాలంనాటి గిరిజన రాణి- రాణి కమలాపతి పేరు పెట్టాలని సూచించింది. ఆ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపింది. హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్లో […]
ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షా లకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. తాజాగా వాతవారణ శాఖ తెలంగాణకు సైతం వర్షం ముప్పు ఉందని పేర్కొంది. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కిందిస్థాయి నుంచి వీస్తున్న గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని, అలాగే బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈనెల […]
కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ పంపిణీని ఒక కుంభకోణంగా వర్ణించారు WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేస్దీ . దీన్ని తక్షణమే ఆపివేయా లన్నారు. కోవిడ్-19పై మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రతిరోజు, తక్కు వ-ఆదాయ దేశాలలో ప్రాథమిక మోతాదుల కంటే ప్రపంచ వ్యాప్తంగా ఆరు రెట్లు ఎక్కువ బూస్టర్ డోస్‌లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్లు ఇవ్వడంలో అర్ధమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు మరియు ఇతర […]
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు సీఎం జగన్. సమావేశంలో విలువైన సమాచారాన్ని, తగిన సూచనలు, సలహాలు అందించిన కర్ణాటక […]
ఆదివారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పార్లమెంట్లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రు లెవరూ హాజరు కాలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. “ఈరోజు పార్లమెంట్లో అసాధారణ దృశ్యం… లోక్‌సభ స్పీకర్ గైర్హాజరు. చైర్మన్ రాజ్యసభ గైర్హాజరు. ఒక్క మంత్రి కూడా హాజరు కాలేదు” పరిస్థితి అసాధారణంగా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. “ఇది ఇంతకంటే దారుణం కాగలదా?” అని రాజ్యసభ ఎంపీ అన్నారు. అని రమేష్ […]
భార్య అంటే తనలో సగం. కష్టసుఖాల్లో తోడూనీడగా ఆమె భర్తకు వెన్నంటి వుంటుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి వివాహం అనే మూడుముళ్ళు, ఏడడుగులతో భర్తతో పాటు పుట్టింటిని వదలి మెట్టినింటికి అడుగులు వేస్తుంది. అక్కడ ఏ కష్టం వచ్చినా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది. భర్తకి కష్టం వస్తే ఆమె ఓదారుస్తుంది. భర్తతోటిదే లోకంగా బతుకుతుంది. కానీ, విధి వైచిత్రితో ఆ భార్య దూరం అయితే ఆ భర్త వేదనకు అంతే వుండదు. ఆమె గురుతులతో కాలం […]