రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సయ్యద్ షాహిద్, పేదిరిపాటి శేఖర్ గౌడ్ అనే ఇద్దరు నిందితులు నకిలీ అగ్రిమెంట్ పేపర్లతో నగరంలోని ముసాపేట్‌లో 1500 గజాల విలువైన భూమిని అమ్మకానికి యత్నించారన్నారు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తకి రూ.11 కోట్ల 25లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలిపారు. అడ్వాన్స్‌గా రూ. 1 కోటి 10 లక్షలను వ్యాపారవేత్త […]
ఒక్క క్షణమైనా ఫోన్ లేకుండా ఉండలేని రోజులు ఇవి. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా డేటా ఛార్జీలు బాగా తగ్గాయి. అయితే ఈ మధ్యకాలంలో నిర్వహణ కష్టంగా వుందని ప్రైవేట్ టెలికాం సంస్థలు భారీగా ధరలు పెంచేశాయి. వీఐ, జియో, ఎయిర్ టెల్.. ఈ ప్రైవేట్ సంస్థలన్నీ ధరలు పెంచినా దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం బీఎస్ఎన్ ఎల్ మాత్రం తన ఛార్జీల్లో మార్పులు చేయలేదు. ఎయిర్ టెల్ రూ. 179 జియో రూ.155 వీఐ […]
దిశ నిందితుల ఎన్కౌంటర్ తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఎన్కౌంటర్ పై హక్కుల సంఘాల దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ను నియమించింది.ఈ కమిషన్ సభ్యులు ఆదివారం నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సిర్పూర్కర్ కమిషన్ ఈ ఎన్కౌంటర్ పై విచారణ చేస్తుంది. కరోనా కారణంగా కమిషన్ విచారణ ఆలస్యమైంది. దీంతో కమిషన్‌కు సుప్రీం కోర్టు గడువును పెంచింది. దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురైన షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి ప్రాంతాన్ని సిర్పూర్కర్ […]
ఏపీలో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల పై ఫోకస్ చేసింది వైసీపీ. వన్ టైం సెటిల్మెంట్ పథకం పై పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హాజరయ్యారు. పేదలకు లబ్ది జరక్కుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై సజ్జల విరుచుకుపడ్డారు. ఓటిఎస్ పధకంపై […]
గుంటూరు నగరంలో చైన్ స్నాచింగ్‌ల ముఠా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీస్ శాఖ. గుంటూరులో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని గుట్టురట్టు చేశారు పోలీసుల వారిని అరెస్ట్ చేశారు. 90 ఏళ్ళ ఓ వృద్ధురాలు మెడలో గొలుసు లాక్కొని పరారీ అయ్యాడో నిందితుడు. ముద్దాయిపై గతంలో 8 కేసులు ఉన్నాయి. దొంగిలించిన చైన్ ను లాడ్జి లాకర్ లో భద్రపరిచాడు నిందితుడు. […]
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో బొగ్గు గని కార్మికులను మిలిటెంట్లుగా భావించి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. మరో 11 మంది గాయపడిన సంగతి విధితమే. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ […]
మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా రోగుల సంఖ్య ఐదుకు చేరింది. ఒమిక్రాన్ విషయంలో అంతా జాగ్రత్తగా వుండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దేశంలోని ఐదుగురు ఒమిక్రాన్ రోగుల లక్షణాలను వైద్యులు పరిశీలించారు. ఢిల్లీలోని ఒమిక్రాన్ రోగికి గొంతు నొప్పి, బలహీనత, శరీర నొప్పి ఉన్నదని ఎల్‌ఎన్‌జేపీకి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఆ వ్యక్తికి ప్రధానమైన లక్షణాలు లేవని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పారు.రెండో ఒమిక్రాన్ రోగి అయిన బెంగళూరు వైద్యుడిలో జ్వరం, […]
రాజన్న సిరిసిల్లా జిల్లాలో మాజీ మేయర్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై మంత్రి కేటీఆర్ పై విమర్శల దాడులకు దిగారు. సిరిసిల్ల మునిగిపోతుంటే మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారు. మీరు కేవలం ఐటీమంత్రిగానే పనిచేస్తారు… మీరు మున్సిపల్ మంత్రిగా పనికిరారు. 500 సెక్షన్లు ఉన్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లుగా మార్చి.. కౌన్సిలర్లను, కార్పోరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత […]
తెలంగాణలో నిన్న మొన్నటివరకూ కరోనా నియంత్రణలో వుంది. అయితే విదేశాలనుంచి విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. విదేశాలనుంచి వచ్చేవారి విషయంలో నియంత్రణ చేపట్టింది. అయితే, తెలంగాణలో కరోనా నియంత్రణకు ఎలాంటి పటిష్ట చర్యలు చేపట్టకపోవడం, కరోనా నియంత్రణకు మాస్క్ ధరించక పోవడంపై లోకాయుక్త సీరియస్ అయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టకకపోవడం, స్మోకింగ్ పై సుమోటోగా కేసు స్వీకరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకాయుక్త. గుంపులుగా […]
మూడో భార్య కోసం రెండో భార్యకు నిత్య పెళ్లికొడుకు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో నిత్య పెళ్ళికొడుకు బాగోతం బట్టబయలయింది. రెండోభార్యను హతమార్చేందుకు నిత్య పెళ్ళికొడుకుఈ దారుణానికి ఒడిగట్టాడు. కంప్యూటర్ యుగంలోనూ తాంత్రిక పూజలు చేయడం సంచలనం కలిగించింది. పాల్వంచ మండలం శేఖర బంజరకు చెందిన కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం ఒక మహిళను పెళ్ళాడాడు. వీరికి పిల్లలు కూడా వున్నారు. మరో మహిళను రెండో […]