మొదటి నుంచి భారత్-రష్యా మైత్రి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు కూడా అంతే ప్రత్యేకమైనవి. రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్‌కు రానున్నారు. రెండు దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా భారత్ ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు. వీరి సమావేశానికి ముందు ఇరు దేశాల రక్షణ, విదేశాంగశాఖ ప్రతినిధులు చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో పలు కీలక […]
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో TGO మరియు TNGO ఎంప్లాయీస్ యూనియన్లతో రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా వివిధ శాఖలు వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు పై సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్ల వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై TGO, TNGO సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులందరికీ […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్ర విడుదలకు సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర విడుదలను […]
యువ నటుడు నాగశౌర్య హీరోగా ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన యువనటుడు శర్వానంద్ ఈ చిత్రం బంపర్ హిట్ […]
కేరళలో మతతత్వాన్ని వ్యాపింపజేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలు చేస్తుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ అవకాశవాద ధోరణితో దానికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. ఆదివారం అలప్పుజాలో జరిగిన పి కృష్ణపిళ్లై స్మారక అధ్యయన కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయన్ మాట్లాడుతూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి సంఘ్‌పరివార్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తుంటే, అధికారం ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న అవకాశంతో కాంగ్రెస్ ఆ మతత్వశక్తులతో మద్దతునిస్తుందని ఆయన అన్నారు. మతతత్వాన్ని వ్యాపింపజేసేందుకు ఆహారం, దుస్తులు వంటి వాటిని […]
మన జెండా.. మువ్వన్నెల పతాకం మన జాతి ఔన్నత్యానికి ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఎక్కడుందో తెలుసా? నేవీ డే సందర్భంగా ఆర్థిక రాజధాని ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జాతీయ జెండా ఆషామాషీగా లేదు. చాలా పెద్దది. జాతీయ జెండా 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు, 1400 కేజీల బరువుతో ఉన్న మన జెండా అందరినీ ఆకట్టుకుంటోంది. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో దీన్ని ప్రదర్శించారు. […]
అగ్విపర్వతాల దీవి ఇండోనేషియాలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై..లావా నదీ ప్రవాహమై ప్రవహించింది. ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. భూకంపాలకు నెలవైన జావా ద్వీపంలో అతి ఎత్తైన సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం నిన్న అర్దరాత్రి దాటిన తరవాత ఒక్కసారిగా బద్దలైంది. అందులోంచి లావా అంతే నదిలా ప్రవహించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. 90 మందికి గాయాలయ్యాయి. వేయిమందికి పైగా […]
కార్తీక మాసం చివరిరోజు కావడంతో ఆదివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఏవీ నగరం నుంచి సుమారు వందమంది భక్తబృందం రామనామ స్మరణ చేస్తూ ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. మూలవరులకు ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆర్జిత సేవగా సువర్ణపుష్పార్చన, సహస్రనామార్చన, కేశవనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి […]
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు పీఆర్సీ ఇతర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.. తాజగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఏపీ ఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు బండి శ్రీనివాసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల ఉద్యమానికి ఎవరైనా తలవంచాల్సిందేనని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా తమ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. రాష్ర్ట వ్యాప్తంగా 13లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఇంట్లో 5 ఓట్లు ఉంటాయని […]
స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగాక పిల్లలమీద ఒక కన్నేసి వుంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు, వైద్యులు మొత్తుకుంటున్నా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. లాక్ డౌన్‌తో ఇళ్లకే పరిమితం కావడంతో గేమ్స్ పిచ్చిలో పడి.. పిల్లలు ఇప్పుడు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ చేతిలో పట్టుకుని అదే మాయలో ఉంటున్నారు.అనంతపురం జిల్లాలో పబ్జీకి బానిసై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడో బాలుడు. ఈ గేమ్‌కు బానిసైన […]