మూడో భార్య కోసం రెండో భార్యకు నిత్య పెళ్లికొడుకు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో నిత్య పెళ్ళికొడుకు బాగోతం బట్టబయలయింది. రెండోభార్యను హతమార్చేందుకు నిత్య పెళ్ళికొడుకుఈ దారుణానికి ఒడిగట్టాడు. కంప్యూటర్ యుగంలోనూ తాంత్రిక పూజలు చేయడం సంచలనం కలిగించింది. పాల్వంచ మండలం శేఖర బంజరకు చెందిన కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం ఒక మహిళను పెళ్ళాడాడు. వీరికి పిల్లలు కూడా వున్నారు. మరో మహిళను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె దగ్గర బంగారం, డబ్బు తీసికెళ్ళాడు. మూడో పెళ్ళి చేసుకుని రెండవ భార్య అడ్డు వదిలించుకునేందుకు క్షుద్రపూజలు చేయించారు. రెండవ భార్య పోలీసులకు కంప్లయింట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు.