కేంద్ర హోం శాఖ ఏం చేస్తుంది..? రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో బొగ్గు గని కార్మికులను మిలిటెంట్లుగా భావించి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. మరో 11 మంది గాయపడిన సంగతి విధితమే. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
‘ఇది హృదయ విదారకం. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిజమైన సమాధానం ఇవ్వాలి. స్వదేశంలోనే పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు అసలు హోం శాఖ మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు’ అంటూ ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెరుప్యూ రియో ఇప్పటికే అత్యున్నత స్థాయి సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ 3 కోర్ సైతం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. పౌరుల ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొంది.
Also Read
This is heart wrenching. GOI must give a real reply.
What exactly is the home ministry doing when neither civilians nor security personnel are safe in our own land?#Nagaland pic.twitter.com/h7uS1LegzJ
— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2021
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!