తెలంగాణలో వరి ధాన్యం పై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తునే ఉంది. కేంద్రం, రాష్ర్టం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఇదే విషయన్ని చర్చించడానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన బృందంలో ఢీల్లీ వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అటు బీజేపీ నాయకుల మాటలు వినాలా..ఇటు ప్రభుత్వ మాటలు వినాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా మరోసారి […]
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామస్తులకు వైద్య సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. మలేరియా డెంగ్యూ పరీక్షలు కిట్స్ లేవన్న వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహించారు గ్రామస్తులు. ఇప్పటికే అంతుచిక్కని వ్యాధి తో నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యానికి గురైన మరో 50 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.వరుస మరణాల నేపథ్యంలో పాఠశాలను బలవంతంగా మూయించారు తల్లిదండ్రులు.
ఉద్యమకారులు అందరూ కేసీఆర్ నీ వదిలి బయటికి రావాలని ఉద్యమకారులకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి ఈటెల రాజేందర్ కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19 మంది ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతుంటే ఒకే ఒక్కటి ఎస్సీ లకు ఇచ్చారని,ఎస్టీలకు ఒక్కరికీ ఇవ్వలేదని అన్నారు.మైనార్టీలకు ఉన్న ఒక్కటి లాక్కొని వారి కళ్లలో మట్టి కొట్టారని […]
నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతులకు చేతులెత్తి మొత్తుకున్నారు. కాళేశ్వరం ప్యాకేజ్ 20,21,21A పనుల పురోగతి పై కలెక్టరేట్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఆర్మూర్, బాల్కొండ,మెట్ పల్లి మెట్ట ప్రాంత రైతులకు మరో రెండు నెలల్లో గోదావరి జలాలు అందిస్తాం అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 80 కిలోమీటర్లు పైపు లైన్ పనులు పూర్తి చేశామని వివరించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రైతులకు చేతులెత్తి […]
రాజకీయ భీష్ముడు తెలుగు రాష్ర్టాల్లో మచ్చలేని మనిషిగా ఎదిగి రాజకీయల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్య మంత్రి కొణిజేటీ రోశయ్య అంత్య క్రియలు ఆదివారం మధ్యాహ్నం కొంపల్లిలోని తన ఫాంహౌస్‌లో పూర్తి అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. ఆయన అంత్య క్రియలకు ప్రముఖులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఆయనకు కన్నీట వీడ్కోలును పలికారు. రోశయ్య మరణంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని రాజకీయ నాయకులు ఒక గొప్ప […]
జవాద్ తుఫాన్ బీభత్సం కలిగించింది. జవాద్ తుఫాన్ ముప్పు తప్పిందని అనుకోవడానికి వీలు లేకుండా మరో ముప్పు వచ్చిపడింది. విశాఖ ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి బీటలు వారింది. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోవడంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. చిల్ట్రన్ పార్క్‌లో అడుగుమేర భూమి కుంగిపోయింది. పార్క్‌లోని బల్లలు ఒక పక్కకు ఒరిగిపోగా, ప్రహరీగోడ కూలిపోయింది. […]
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని సీపీఎం మాజీ ఎమ్మెల్యే, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవాలని చూస్తే రైతులు చూస్తూ ఊరు కోరని వారి పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కళ్లాల వద్ద ధాన్యం వానలకు తడిసి, ఎండలకు ఎండుతుందని మార్కెట్లలో మౌలిక […]
చిత్తూరు జిల్లాలో రహదారులు రక్తమోడాయి. చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డివైడర్ ఢీకొనడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేగంగా వెళుతూ డివైడర్ ఢీకొట్టారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వుంది. వారిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కాణిపాకం నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారు విజయనగరం,శ్రీకాకుళం జిల్ల్లాలకు […]
రోశయ్య మరణం రాష్ర్టానికి, రాష్ర్ట రాజకీయాలకు తీరని లోటని మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అన్నారు. రోశయ్యకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోశయ్య గౌరవ ప్రదమైన వ్యక్తి అని ఆయన అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, మంత్రిగా ఏపీకి ఎన్నో సేవలు అందించారన్నారు. చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఆర్థిక వ్యవస్థకే వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. […]
హైదరాబాద్‌లో యువత స్పీడ్‌కి బ్రేకులే లేవు. కాస్త ఖాళీ దొరికిందంటే చాలు వివిధ రకాల బైక్‌లతో రోడ్లమీదకు వచ్చేస్తారు యువత. తాజాగా హైదరాబాద్‌లో యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేశారు. హైదరాబాద్‌లో పట్టపగలే పోకిరీల విన్యాసాలు కలకలం రేపాయి. రద్దీ ఉన్న ఏరియాలో బైక్ విన్యాసాలు చేస్తున్నారు పోకిరీలు. సెలవు దినం కావడంతో ఆదివారం హైదరాబాద్ రోడ్లపై విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు కుర్రకారు. మలక్ పేట ప్రాంతంలో బైక్ విన్యాసాలు […]