తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేయలేమని ఏపీ పెట్రోలియం ట్యాంక్ ఆపరేటర్స్ అసోషియన్ అధ్యక్షడు వై.వి ఈశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు 125 ట్రక్కుల ద్వారా 160 బంకులకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టెండర్లు వేసిందన్నారు. ఈ టెండర్లలో పశ్చిమ, తూర్పు గోదావరి నుంచి ఒక్కరంటే ఒక్కరూ పాల్గొనలేదని ఆయన […]
అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. […]
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. అంబేడ్కర్తోనే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. అంబేద్కర్ ముందు చూపుతోనే మన దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె పేర్కొన్నారు. కాగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వలనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వెనుబడిన వర్గాల ప్రజలకు ఇంకా రాజ్యాంగ […]
తెలంగాణ అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో.. దాదాపు ఆర్టీసీ బస్సులన్నీ ఒకే కలర్ లో ఉంటాయి. ఆ రంగులను బస్సు పేర్లను ఇప్పటికి రెండు రాష్ర్టాల ఆర్టీసీ సంస్థ ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టలేదు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి కాలంలో… గ్రామాల్లో నడిచే బస్సులకు పల్లెవెలుగు అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే… ఇప్పటికీ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అప్పటి నుంచి ఆ బస్సుల కలర్‌ను గానీ పేరును గానీ మార్చలేదు. ఏ ప్రభుత్వాలు.. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని […]
తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్తులను బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆ పార్టీల్లో పలువురు నేతల్ని బీజేపీ ఈమ పార్టీలో కి చేర్చుకోవాలని భావిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసుకునే యోచనలో బీజేపీ ఉంది. దీనిపై ఆపార్టీ నాయకులే .. మేం నేతలను చేర్చుకుని తెలంగాణలో బలపడతామని బహిరంగంగానే […]
తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంటరైయిందా అనే అనుమాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు 1000 మంది వచ్చారు. వీరందరిని టెస్టులు చేశామని వైద్యాఆరోగ్య శాఖ చెప్పింది. ఇందులో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఒమిక్రాన్ వేరింయట్ కాదా అనేది నిర్ధారించేందుకు జీనోమ్ స్వీకెన్సీంగ్ ల్యాబ్‌కు పంపించామని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. వీటి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో వస్తాయని తెలిపారు. కోవిడ్‌ను రాష్ర్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని హెల్త్ డైరెక్టర్ ఇప్పటికే చెప్పారు. కరోనా కేసులను దాచిపెడుతున్నామన్న […]
ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. ఓ మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తులో ఒక అడుగు ముందుకు వేశారు. తల్లీ కూతుళ్ల హత్యను నరహంతక ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇంట్లో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. హత్య ప్రదేశంలో సేకరించిన వేలిముద్రలతో పాటు బూటు గుర్తులతో నేరస్తుల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పోలీసులు […]
దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ అనంతపురం జిల్లా వైద్య శాఖ అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను వైద్య శాఖ అధికారులు తీసుకుంటున్నారు. మరోసారి కరోనా ముప్పు రాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిపై ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై నిఘా పెట్టడంతో పాటు వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన 471 […]
కరోనా ఫస్ట్, రెండో వేవ్ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ‘లోకల్ సర్కిల్స్’ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదనిఈ సర్వే తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మాస్క్ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్‌లో 29శాతం పడిపోయిందని తెలిపింది. […]
ప్రపంచ వ్యాప్తంగా వాల్ట్ డీస్నీ సంస్థ చైర్‌పర్సన్‌గా తొలిసారిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. మేనేజ్మెంట్, ఆర్థిక, సౌందర్య ఉత్పత్తుల రంగాల్లో అపార అనుభవజ్ఞురాలైన 67 ఏళ్ల సూసన్ అర్నాల్డ్ త్వరలో పదవిని స్వీకరించనున్నారు. 14 ఏళ్లుగా డీస్నీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. గతంలో ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అయిన కార్లైల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సుసేన్ఆర్నాల్డ్ 2018 నుండి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె మెక్‌డొనాల్డ్స్ మరియు NBTYలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆమె […]