కన్నడ సీని పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగింది. ఈ మధ్య కాలంలో మరణించిన పునీత్ రాజ్‌కుమార్ మృతి నుంచి కన్నడ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాగా తాజాగా మరోనటుడు మరణించిన వార్తను కన్నడ సీని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజా కార్యక్రమాలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకులారు. శివరాంను కుటుంబ […]
దేశంలో కరోనా వ్యాక్సిన్లు యుద్ధ ప్రాతిపదికన వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు బామ్మలు సమ్ థింగ్ స్సెషల్ గా నిలిచారు. వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఔరా అనిపించారు. జిల్లాలో కరోనా టీకా తీసుకున్నారు ఈ ఇద్దరు వందేళ్ల వృద్ధులు. భీం పూర్ మండలం తాంసీ కే కు చెందిన వాంకడే తాను బాయి, గాదిగూడకు చెందిన సాబ్లే కమలా బాయిలు కరోనా వ్యాక్సిన్ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరి వయసు 100కు పైమాటే. ఈ వయసులోనూ ఎంతో బాధ్యతగా, […]
అనంతపురం జిల్లాలో రికార్డులు బద్ధలయ్యాయి. కరువుసీమలో వందేళ్లలో లేనంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏడాదంతా కురిసే వర్షం నెలరోజుల్లోనే 40 శాతం కురిసింది. భారీ స్థాయిలో వానలు కురవడంతో నష్టం కూడా బాగా పెరిగింది. నిత్యం కరువుతో వుండే ప్రాంతంలో వానలే వానలు. మంచి నీటి కోసం ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు వాటర్ పైప్ లైన్లు పాడయిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో కనీవీనీ ఎరుగని రీతిలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాణాలు కూడా పోయాయి. 150 […]
ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు దగ్గర తారు రోడ్డు వేస్తున్న రెండు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరారు. ఘటనా స్థలంలో PLGA వారోత్సవాలు విజయవంతం చేయాలని కరపత్రం వదిలి వెళ్ళారు మావోయిస్టులు. మావోయిస్టుల PLGA వారోత్సవాల సందర్భంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటూరునాగారం పీఎస్ కు 15 కిమీ దూరంలో వాహనాలు ధ్వంసం చేసి పోలీసులకు సవాల్ విసిరారు మావోయిస్టులు. ఇటీవల భారీ ఎన్ కౌంటర్‌కు […]
హుజురాబాద్ ఉప ఎన్నిక మినీ రాజకీయ యుద్ధాన్ని తలపించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. ఒకరి మీద కరు విమర్శలు ప్రతి విమర్శలతో మాటల దాడికి దిగారు ఆయా పార్టీల నేతలు. అధికార పార్టీ దొంగల పార్టీ అని బీజేపీ వాళ్లు అంటే .. టీఆర్ఎస్ పార్టీనే దొంగల పార్టీ అని బీజేపీ నాయకులు ఒకరి పై […]
ప్రపంచం గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాదిమంది బలయ్యారు. ప్రతి దేశం ఈ కోవిడ్ బారిన పడింది. కరోనా ఇక తగ్గుముఖం పట్టిందిలే అని భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ ప్రభావం కనిపిస్తోంది. మూడుకేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ మళ్లీ తన సత్తా చాటుతుందని భావిస్తున్న వేళ పలు దేశాలు కఠిన ఆంక్షలవైపు మళ్లుతున్నాయి. ఈసారి సరికొత్త రూపంలో లాక్డౌన్లకు సిద్ధమయ్యాయి. కరోనా నుంచి రక్షణగా భావిస్తున్న టీకా […]
రక్షణ రంగంలో ఉత్పత్తుల తయారీలో భారత్‌ను స్వయం సమృద్ధిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీన్లో భాగంగానే సుమారు ఐదు లక్షల ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లో ఈ ఆధునిక తుపాకులను తయారు చేయనున్నారు. 7.62 X 39mm క్యాలిబర్ కలిగిన ఏకే 203 రైఫిళ్లను.. ఇన్సాన్ రైఫిళ్ల స్థానంలో వాడనున్నారు. ఇన్సాన్ రైఫిళ్లను ఇండియాలో గత మూడు దశాబ్దాల నుంచి వాడుతున్నారు. ఏకే-203 […]
హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ నుంచి హిరోయిన్ నిధి అగర్వాల్‌ను తప్పించారనే వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపింది. పవస్టార్ పవన్ కళ్యాణ్ హిరోగా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం హరిహర వీర మల్లు ఇప్పటికే ఈ సినిమాను క్రిష్‌తోపాటు మరో డైరెక్టర్ ఆనంద్ సాయి భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించేందుకు రాజస్థాన్‌లో ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ […]
భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ముఖ్యమయిన స్థానం వుంది. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకరరాశి, కుంభరాశులకు అధిపతి అని చెబుతారు. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుందంటారు. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని బంగారంలా మెరిసేలా చేస్తుంది. భక్తితో శనీశ్వరుడిని ప్రార్ధిస్తే సేవల ద్వారా స్వామి […]
గుంటూరు జిల్లాలోని నగర పాలెం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్ముతున్న నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ .. మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రేవంత్‌గా గుర్తించామని, రేవంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడ్డ నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల దగ్గరనుంచి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం […]