గుంటూరు నగరంలో చైన్ స్నాచింగ్‌ల ముఠా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీస్ శాఖ. గుంటూరులో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని గుట్టురట్టు చేశారు పోలీసుల వారిని అరెస్ట్ చేశారు. 90 ఏళ్ళ ఓ వృద్ధురాలు మెడలో గొలుసు లాక్కొని పరారీ అయ్యాడో నిందితుడు. ముద్దాయిపై గతంలో 8 కేసులు ఉన్నాయి.
దొంగిలించిన చైన్ ను లాడ్జి లాకర్ లో భద్రపరిచాడు నిందితుడు. రెండు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులలోముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దొంగిలించిన వస్తువులు కొనే వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ముద్దాయిల నుండి 2 బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారు ఆభరణాల విలువ లక్షా ముప్పై ఐదు వేలు వుంటుందని గుంటూరు పోలీసులు తెలిపారు.