Hyundai: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) దేశవ్యాప్తంగా తన మొత్తం మోడల్ లైనప్‌పై ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. వాహనాల తయారీలో కీలకమైన విలువైన లోహాలు, ఇతర కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఇన్‌పుట్ ఖర్చులు అధికమయ్యాయని కంపెనీ ఈ నిర్ణయానికి కారణంగా పేర్కొంది. మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో HMIL సగటున సుమారు 0.6 శాతం మేర ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ముడి సరుకులపై కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను సమతుల్యం చేయడానికే ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది.
Tata Motors: హ్యుందాయ్, మహీంద్రాను వెనక్కి నెట్టిన టాటా.. నెక్సాన్, సియెర్రా వల్లే ఈ ఘనత!
మోడల్ వారీగా ధరల పెంపు వివరాలను కంపెనీ వెల్లడించకపోయినా.. క్రెటా ఎస్‌యూవీ, వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎక్స్టర్ మైక్రో ఎస్‌యూవీ, గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్‌బ్యాక్, ఆల్కాజార్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లపై ఈ ధరల పెంపు ప్రభావం చూపనుంది. భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పటికే అనేక కంపెనీలు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నాయి. ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌కు చెందిన రెనాల్ట్ ఇండియా జనవరి 2026 నుంచి తన మోడళ్లపై గరిష్టంగా 2% వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇదే విధంగా JSW MG మోటార్ ఇండియా, Mercedes-Benz ఇండియా కూడా అదే తేదీ నుంచి 2 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు తెలిపాయి. హోండా కార్స్ ఇండియా, నిస్సాన్ మోటార్ ఇండియా, BYD కంపెనీలూ ధరల పెంపు బాటలోనే నడుస్తున్నాయి.
120Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరా, Android 16తో Oppo Reno 15 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధరల పెంపు పరిమిత స్థాయిలోనే ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డిమాండ్ స్థిరపడటం, పోటీ పరిస్థితులు ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. భారత్‌లో రెండో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్న హ్యుందాయ్ 2025లో 5.6 లక్షలకుపైగా వాహనాలను విక్రయించింది. క్రెటా మోడల్ సెగ్మెంట్ లీడర్‌గా కొనసాగుతుండగా, ఎక్స్టర్ ఎంట్రీ లెవల్ విభాగంలో మంచి ఆదరణ పొందుతోంది.