రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సయ్యద్ షాహిద్, పేదిరిపాటి శేఖర్ గౌడ్ అనే ఇద్దరు నిందితులు నకిలీ అగ్రిమెంట్ పేపర్లతో నగరంలోని ముసాపేట్‌లో 1500 గజాల విలువైన భూమిని అమ్మకానికి యత్నించారన్నారు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తకి రూ.11 కోట్ల 25లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలిపారు.
అడ్వాన్స్‌గా రూ. 1 కోటి 10 లక్షలను వ్యాపారవేత్త దగ్గర నుంచి తీసుకున్న చీటర్స్. అగ్రిమెంట్ డాక్యూమెంట్లు, భూమి కాగితాలు ఫేక్ అని తేలడంతో వీరిపై అనుమానం వచ్చిన బాధిత వ్యాపారవేత్త హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.సయ్యద్ షాహిద్, పేదిరిపాటి శేఖర్ గౌడ్‌ను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.