Oppo Reno 15: ఒప్పో (Oppo) Reno 15 సిరీస్‌ను తైవాన్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 15 ప్రో మాక్స్ (Oppo Reno 15 Pro Max), రెనో 15 ప్రో (Reno 15 Pro), రెనో 15 (Reno 15) అనే మూడు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్‌ప్లేలు, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూడు మోడళ్లకు IP69 రేటింగ్ లభించడంతో నీరు, ధూళి నుంచి అధిక రక్షణ లభిస్తుంది. ఈ మొబైల్స్ అన్ని ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16తో పనిచేస్తాయి.
Oppo Reno 15 Pro Max స్పెసిఫికేషన్స్:
Reno 15 Pro Maxలో 6.78 అంగుళాల AMOLED ఫుల్ HD+ (1272×2772 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. అలాగే ఇందులో MediaTek Dimensity 8450 ప్రాసెసర్, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 200MP మెయిన్ సెన్సార్ (OIS, ఆటోఫోకస్), 50MP 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (OIS), 50MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇంకా 6500mAh బ్యాటరీతో 80W వైర్డ్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Reno 15 Pro, Reno 15 స్పెసిఫికేషన్స్:
Reno 15 Proలో 6.32 అంగుళాల AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లే, MediaTek Dimensity 8450 చిప్‌సెట్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. 6200mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే Reno 15 మోడల్‌లో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 12GB ర్యామ్‌తో గరిష్టంగా 512GB స్టోరేజ్ అందించారు. దీనిలో 6500mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, IP69 రేటింగ్ ఉన్నాయి.
Oppo Reno 15 Pro Max ధర TWD 24,990 (రూ.71,000). ఇది 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో లభించనుంది. ఇది ట్విలైట్ గోల్డ్, డెసర్ట్ బ్రౌన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక రెనో 15 ప్రో ధర TWD 20,990 (రూ.60,000). ఇది అరోరా బ్లూ, డెసర్ట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. స్టాండర్డ్ రెనో 15 12GB + 256GB వేరియంట ధర TWD 17,990 (రూ.51,000)కు, 12GB + 512GB వేరియంట్ TWD 19,990 (రూ.55,000)గా లాంచ్ అయ్యింది. ఇది అరోరా వైట్, స్కై బ్లూ రంగుల్లో లభిస్తుంది.
