మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా పిలువబడే పట్టణంలో కలుషిత నీరు కారణంగా దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,400 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
తీవ్ర విషాదం
10 పదేళ్ల తర్వాత జూలై 8న ఒక బిడ్డ జన్మించాడు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. కానీ కలుషిత నీరు కారణంగా మృత్యువు వెంటాడింది. పాలల్లో కలుషిత నీరు కలవడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Afghanistan: ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి, రోడ్డున్న పడ్డ 1,800 కుటుంబాలు..!
పరిశుభ్రతకు మారుపేరు ఇండోర్ నగరం. అలాంటిది మంచి నీళ్ల పైప్‌లైన్‌లో డ్రైనేజీ వాటర్ కలిసింది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీళ్ల పైప్‌లైన్‌లో కలుషిత నీరు కలుస్తుందని ప్రజలు మొర్ర పెట్టుకున్నా పట్టించుకోలేదు. వాస్తవంగా భగీరత్‌పుర పైప్‌లైన్‌ను మార్చడానికి 2025 ఆగస్టులోనే టెండర్ దాఖలు చేయబడిందని వర్గాలు తెలిపాయి. రూ. 2.4 కోట్ల అంచనా వ్యయంతో దాఖలైంది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: OTR: టీడీపీ, వైసీపీ రాజకీయాల మధ్య తిరుమల దర్శనాల వివాదం!
అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇక వైద్య పరీక్షల్లో కూడా కలుషిత నీరు కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు అందాయి. అలాగే మంత్రి కైలాష్ విజయవర్గియా కూడా తాగునీటిలో మురుగునీరు కలవడమే కారణమని అంగీకరించారు.