రాష్ర్టప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణకు హరితహారం పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆకుపచ్చ తెలంగాణ మార్చడానికి కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేసి హరిత తెలంగాణ నిర్మించడంలో ప్రభుత్వం కొంతమేరకు విజయవంతం అయిందని చెప్పవచ్చు. ఈ పథకంలో గ్రామ స్థాయినుంచి ప్రతి ఒక్కర్ని భాగస్వామ్యం చేసి మంచి ఫలితాలు సాధించారు. Also Read: ఇక్కత్ చేనేత కార్మికులకు ప్రోత్సాహం: […]
పోచంపల్లి చేనేత కళాకారులు నిలువు పేకల మగ్గంపై నేసిన చేనేత కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పోచంపల్లి చేనేతకే కాకుండా ఈ ప్రాంతం భూదానోద్యమానికి ప్రసిద్ధి చెందింది. అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. చేనేతల్లో మొదటగా పేటెంట్ హక్కు పొందడం ఈ ప్రాంతం ప్రత్యేకత. ఇక్కత్ పట్టు వస్ర్తాలను ఉత్పత్తి చేస్తున్న చేనేత కళాకారులు.. ఆ వృత్తిపై ఆధారపడిన కార్మికులకు చేయూతనిచ్చి.. పర్యాటకులను ఆకట్టుకోవడానికి పథకాలను రూపొందిస్తామని తెలంగాణ […]
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి వణికిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే శీతల గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట చలి అధికంగా ఉండటంతో పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతలగాలులు, దట్టమైన పొగమంచును కప్పి ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు. చూడటానికి సుందరంగా ఉన్న చలి కారణంగా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. Also Read: మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధర ఏజెన్సీలోని వరుసగా […]
తిరుపతి రాజధాని రైతుల సభకు కన్నా ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక సీఎం జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం, ఏపీ భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులను మోసం చేశారు. మూర్ఖత్వపు ఆలోచనతో సీఎం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. సీఎం జగన్ ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ మండిపడ్డారు. […]
దేశ వ్యాప్తంగా నిర్వహించే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ-టెట్) పరీక్షను వాయిదా వేశారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. అయితే ఆన్లైన్లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్టు ప్రకటించారు. దేశంలో వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పరీక్షలు జనవరి 13 వరకు జరగనున్నాయి. మొదటి రోజు పేపర్ -2 పరీక్షలో సర్వర్ సమస్య తలెత్తింది. సాయంత్రం 4 గంటలైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు. […]
భారత్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో టెన్షన్ పెరిగిపోయింది. ఐదు రోజుల క్రితం కర్ణాటకలో మూడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఆ తరువాత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వరసగా కేసులు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 87 కి చేరింది. ఈరోజు తెలంగాణలో నాలుగు కేసులు నమోదవ్వగా, కర్ణాటకలో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోని కర్ణాకటలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్ర 32, రాజస్థాన్ 17, […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే 1వ గనీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఘటనను గోప్యంగా ఉంచారు అధికారులు. కెటికె 1 గని లో ఫస్ట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు పైన రూప్ గోడలు కూలి మీద పడ్డాయి. దీంతో కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం ఘటనలో ఒకరికి కాలు పైన నుండి దూసుకెళ్లిన ఎస్.డి.ఎల్ వాహనం. దీంతో కాలి ఎముకలు విరిగిపోయాయి. కార్మికునికి స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో […]
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది. ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన […]
బాల కార్మికుల నిర్మూలన దిశగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపున్న చిన్నారులతో ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలు శిక్షను విధిస్తామని తెలిపింది. అంతేకాకుండా రూ.20 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధంచే అవకాశం కూడా ఉన్నట్టు తెలంగాణ సర్కార్ తెలియజేసింది. బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలన, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు సర్కార్ ప్రకటించింది. […]