విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి వణికిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే శీతల గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట చలి అధికంగా ఉండటంతో పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతలగాలులు, దట్టమైన పొగమంచును కప్పి ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు. చూడటానికి సుందరంగా ఉన్న చలి కారణంగా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు.
Also Read: మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధర
ఏజెన్సీలోని వరుసగా రెండో రోజు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ముందు ముందు ఇంకా చలి ఎలా ఉంటుందోనని స్థానికులు చలిగుప్పిట్లో భయంతో వణికిపోతున్నారు. ఈ సీజన్లో అత్యల్పంగా మినుములురు 07, చింతపల్లి 8.4, పాడేరు 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే సంక్రాంతి నాటికి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతే పరిస్థితి ఏంటని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.