Portronics Pico 14 Projector: థియేటర్లతో పని లేకుండా, ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్లగలిగేలా ఉండే 100 ఇంచెస్ టీవీ గురించి మీకు ఏమైనా తెలుసా.. నిజానికి ఇది చాలా స్పెషల్. ఎందుకంటే మీ జేబులో 100 అంగుళాల టీవీని అమర్చుకోగలిగితే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు కావలసినప్పుడల్లా మీరు దాన్ని ఎక్కడికైనా, తీసుకొని వెళ్లి ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ దాని స్టోరీ ఏంటి, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
READ ALSO: Neethi Bellam Sunnundalu: ఎముకలకు బలం ఇచ్చే.. నేతి బెల్లం సున్నుండలు
థియేటర్లతో పని లేకుండా, ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్లగలిగేలా ఉండేది, దానిని మీ జేబులో పెట్టుకోగలిగే ఉన్న మినీ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం. అలాంటి ఒక ప్రొజెక్టర్‌ను పోర్ట్రోనిక్స్ విక్రయిస్తుంది. దాని పేరే పోర్ట్రానిక్స్ పికో 14 ప్రొజెక్టర్. ఇది 100-అంగుళాల స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేయగలదు. అంతేకాకుండా ఈ ప్రొజెక్టర్ అంతర్నిర్మిత బ్యాటరీ, స్పీకర్లతో వస్తుంది. దీని అర్థం ఏమిటంటే.. దీనిని ఉపయోగించడానికి ఎలాంటి విద్యుత్ అవసరం లేదు, అలాగే ఇది స్పీకర్‌గా కూడా పనిచేస్తుంది. ఈ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 13 పై నడుస్తుంది, ఇది డ్యూయల్-బ్యాండ్ Wi-Fi తో వస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ వివిధ రకాల OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ రిమోట్ కంట్రోల్‌తో మార్కెట్‌లోకి వస్తుంది. ఇది కేవలం 250 గ్రాముల బరువు, 60mm ఎత్తు, 73mm వెడల్పుతో మీ జేబులో సరిపోయేలా ఉంటుంది. అలాగే ఈ ప్రొజెక్టర్‌కు 1600 ల్యూమెన్ల పవర్ అవుట్‌పుట్ ఉంటుంది. దీన్ని చీకటి గదిలో ప్రొజెక్ట్ చేయాలి, దీనిని ప్రకాశవంతమైన ప్రదేశంలో యూజ్ చేయకూడదు. దీని ధర విషయానికి వస్తే.. ఈ ప్రొజెక్టర్.. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.28,349 కు అందుబాటులో ఉంది. అయితే దీనిని అమెజాన్‌లో రూ.25,599 కు కొనుగోలు చేయవచ్చు.