రాష్ర్టప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణకు హరితహారం పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆకుపచ్చ తెలంగాణ మార్చడానికి కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేసి హరిత తెలంగాణ నిర్మించడంలో ప్రభుత్వం కొంతమేరకు విజయవంతం అయిందని చెప్పవచ్చు. ఈ పథకంలో గ్రామ స్థాయినుంచి ప్రతి ఒక్కర్ని భాగస్వామ్యం చేసి మంచి ఫలితాలు సాధించారు.
Also Read: ఇక్కత్ చేనేత కార్మికులకు ప్రోత్సాహం: టీడీసీ
తాజాగా ఈ పథకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం కొనసాగాడానికి హరిత నిధిని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి అటవీ పర్యావరణ శాఖ మంత్రి చైర్మన్‌గా, రాష్ర్టస్థాయిలో కమిటీ ఏర్పాటు చేసింది. హరిత నిధి వినియోగానికి నోడల్ ఏజెన్సీగా అటవీ శాఖ వ్యవహరించనుంది. కాగా ప్రభుత్వం 2015 నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఏడాది రెండు విడతలుగా నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో మంచి ఫలితాలు వచ్చాయి.