Dhurandhar: బాలీవుడ్ లెటెస్ట్ సెన్సేషన్ ‘‘ధురంధర్’’ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని సృష్టిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్ కరాచీలో ల్యారీ గ్యాంగ్, ఉగ్రవాదులు, పాక్ ఐఎస్ఐకి ఉన్న సంబంధాలను హైలెట్ చేస్తుంది. ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు తమిళ స్టార్ సూర్య, ఆయన భార్య జ్యోతిక కూడా చేశారు. ధురందర్ ఒక ‘‘మాస్టర్ పీస్’’ అంటూ అభివర్ణించారు.
Read Also: Nicolas Maduro: సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే వెనిజులా అధ్యక్షుడికి పడుతుందా..?
ఎక్స్‌లో సూర్య ధురందర్ టీమ్‌పై ప్రశంసలు కరిపించారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ను అభినందించారు. ఇలాంటి సినిమా ప్రేక్షకులకు అందించినందుకు మూవీ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్‌లను అభినందించారు. ఇప్పటికే ధురంధర్ రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 3800 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. సినిమా రిలీజ్ అయి 5 వారాలు గడిచినా కూడా కలెక్షన్లలో తగ్గడం లేదు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. ‘‘ధురంధర్ 2’’ ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి రాబోతోంది.
Thank you @AdityaDharFilms for giving this masterpiece. #Dhurandhar what a movie! Completely blown by your craft… love & respect to you and the whole team. Special congrats to my bro @ActorMadhavan – what a transformation! #AkshayeKhanna 👍🏻 & @RanveerOfficial congrats on a very…
— Suriya Sivakumar (@Suriya_offl) January 3, 2026