పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్వీట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘సున్నుండలు’ అని చెప్పవచ్చు. ముఖ్యంగా నడుము నొప్పి తగ్గడానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. పంచదారకు బదులుగా బెల్లం వాడితే రుచితో పాటు ఐరన్ కూడా అందుతుంది. ఈ వీడియోలో చూపించిన సులభమైన తయారీ విధానం ఇక్కడ ఉంది.
Also Read : Healthy Food Myths: హెల్తీ ఫుడ్ అని తింటున్నారా? జాగ్రత్త.. ఆ ఆహారపు అలవాట్లతోనే అసలు ముప్పు!
కావలసిన పదార్థాలు:
1. పొట్టు మినుములు (లేదా మామూలు మినుములు) – 2 కప్పులు
2. బియ్యం – 2 టేబుల్ స్పూన్లు (క్రిస్పీ గా ఉండటం కోసం)
3. బెల్లం తురుము – 1.5 నుండి 2 కప్పులు (రుచికి తగినట్లుగా)
4. నెయ్యి – అర కప్పు (అవసరమైనంత)
5. యాలకుల పొడి – అర టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా మందపాటి గిన్నెలో మినుములను వేసి లో-ఫ్లేమ్ (మంట తక్కువగా ఉండాలి) లో కనీసం 15-20 నిమిషాల పాటు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. వేయించేటప్పుడు చివరిలో బియ్యం కూడా కలిపి వేయించాలి. వేయించిన మినుములు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పిండిలా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి మరోసారి ఒక రౌండ్ తిప్పితే పిండి, బెల్లం బాగా కలిసిపోతాయి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, వేడి చేసిన నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు చుట్టుకోవాలి. అంతే.. ఒక్క ఉండ తింటే చాలు.. బలానికి బలం, రుచికి రుచి.