ఏనుగు తెలివైన జంతువు. స్నేహం చేస్తే మనిషితో ఏనుగులు కలిసిపోతాయి. కోపం వస్తే ఎలాంటి వాటినైనా సరే ఎత్తి అవతల పడేస్తాయి. వాటి మూడ్‌ను బట్టి మసలుకోవాలి. ఒక్కోసారి ఏనుగులు ఫన్నీగా ప్రవర్తిస్తంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే జరిగింది. ఓ మహిళ ఏనుగు ముందు హ్యాట్ పెట్టుకొని నిలబడి ఫొటో దిగింది. అదే సమయంలో ఏనుగు ఆ మహిళ హ్యాట్‌ను తీసుకొని నోట్లో పెట్టుకుంది. ఆనూహ్యంగా జరిగిన ఆ సంఘటనలకు ఆ మహిళ షాక్ అయింది. […]
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆచూకీ భీమవరంలో లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్ధినిని కిడ్నాపర్ భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వుంచాడని తేలింది. కిడ్నాపర్‌ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయం అయ్యాడు భీమవరం మండలం కొత్త పూసలుమర్రుకి చెందిన ఫణీంద్ర. లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని యువతిని నమ్మించాడు ఫణీంద్ర. ఆమెను భీమవరం బలుసుమూడి లో ఒక రూమ్ లో నిర్బంధించాడు. […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఉద్యోగాలు లేక, నిధులు లేక ఆకలితో ఆఫ్ఘన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. మానవతాదృక్పధంతో వివిధ దేశాలు సహాయం అందిస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకోవడంతో తాలిబన్ల హస్తం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, తాలిబన్ నేత సుహైల్ షాహిన్‌తో పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ జమీల్ వీడియో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో పాక్ జర్నలిస్ట్ జమీల్ తాలిబన్ ప్రతినిధికి ప్లైయింగ్ కిస్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. […]
వరంగల్ నగరంలో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది ఐటి దిగ్గజం జెన్పాక్ట్. తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్ ఫాక్ట్ రానుంది. మంత్రి కేటీఆర్‌ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్ ఫాక్ట్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి […]
రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో ప్రపంచంలోని సంహభాగం దేశాలు భారీగా అప్పులు చేశాయి. అగ్రదేశాలు సైతం పెద్ద మొత్తంలో అప్పులు చేశాయి. ఆ తరువాత క్రమంగా ఆర్ధికంగా దేశాలు కోలుకోవడంతో అప్పుల భారం తగ్గించుకుంటు వచ్చాయి. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కరోనా విజృంభణ సమయంలో ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు ఐఎంఎఫ్ ప్రకటించింది. Read: విమానం ఎక్కే అవకాశం లేక…సొంతంగా విమానం తయారు చేశాడు… ఐఎంఎఫ్ నివేదికల ప్రకారం 2020లో ప్రపంచ దేశాలు […]
ప్రతి ఒక్కరికీ విమానంలో ఎక్కాలని ఉంటుంది. అయితే, అందరికీ అవకాశం రాకపోవచ్చు. విమానంలో ప్రయాణం టికెట్టు పెట్టుకుంటే, కుటుంబం మొత్తం కలిసి రైళ్లో హాయిగా ప్రయాణం చేయవచ్చు. అందుకే రైళ్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. విమానంలో ఎలాగైనా ఎక్కాలనే కోరిక ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వినానాన్నే తయారు చేశాడు. దీనికోసం కొన్ని పాత వాహనాలను కొనుగోలు చేసి వాటి సహాయంతో విమానం తయారు చేశారు. ఈ విమానాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. […]
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతులకు రెండున్నర లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్టీవీతో ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి మాట్లాడారు. బస్సు ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుందని.. ఇప్పటికే దీనిపై కమిటీ వేశాం అన్నారు. డ్రైవర్ హెల్త్ కండిషన్, బస్సులో లోపాలున్నాయన్న దానిపై కమిటీ విచారణ జరుపుతుందన్నారు. గ్యారేజి నుంచి […]
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా సార్స్‌కోవ్ 2 వైరస్ మొదట చైనాలోని పూహన్లో కనిపించింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యి ఉంటుందని చాలా కాలంగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నది. అయితే, చైనా అలాంటిది ఏమీ లేదని, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని, అక్కడి నుంచి ఇతరులకు వ్యాపించిందని చెప్తూ వచ్చింది. అయితే, కెనడాకు చెందిన నిపుణులు సైతం […]
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి, ఇతర ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ జరిపారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. విశాఖను పెట్టుబడులకు వేదికగా మలుచుకోవాలన్న సీఎం ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్నారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి. […]
ఈజీమనీ కోసం జనాన్ని నిలువునా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ లక్కీ డ్రా రాకెట్ ముఠా గుట్టురట్టయింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నకిలీ లక్కీ డ్రా రాకెట్‌ను ఛేదించి, ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ముఠాను పట్టుకున్నారు అంబర్ పేట్ పోలీసులు, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నెలవారీ బహుమతులు అనే సాకుతో భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడి అమాయక ప్రజలను […]